Telugu Global
Telangana

వామ్మో, అవి తిట్లు కావు.. రేవంత్ పై పొన్నాల రివర్స్ అటాక్

రేవంత్ పీసీసీ పదవి చేపట్టాక, ఒక్క ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ కి డిపాజిట్ వచ్చిందా అని అడిగారు. రాజీనామా తర్వాత కాస్త మర్యాదగానే మాట్లాడిన పొన్నాల, రేవంత్ రియాక్షన్ తర్వాత మాత్రం.. అంతకంటే ఎక్కువ ఘాటుగా స్పందించారు.

వామ్మో, అవి తిట్లు కావు.. రేవంత్ పై పొన్నాల రివర్స్ అటాక్
X

"పార్టీ మారేందుకు సిగ్గుండాలి, అయినా సచ్చేముందల పార్టీ మారడం ఏంటి..?" అంటూ పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు అంతకంటే ఎక్కువ ఘాటుగా బదులిచ్చారు పొన్నాల. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ స్థాయిలో రేవంత్ రెడ్డిని తిట్టి ఉండరు. గాంధీ భవన్లో గాడ్సే దూరాడంటూ ఇన్నాళ్లూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ ని విమర్శించారు. గాంధీ భవన్లో జొర్రిన గాడిద కొడుకు అంటూ పొన్నాల మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీని నాశనం చెయ్యడానికి వచ్చిన పాగల్ గాడు, డబ్బు పిచ్చి పట్టిన ఒక దగుల్బాజీ.. అంటూ రేవంత్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు పొన్నాల.

విల్లాలు, కోట్ల రూపాయలు, భూములు దొబ్బేసాడంటూ.. ఇప్పటికే బోలెడు మంది రేవంత్ రెడ్డిపై కంప్లయింట్ లు ఇచ్చారని చెప్పారు పొన్నాల. తన చావు గురించి కూడా రేవంత్ మాట్లాడారని, ఎవరి చావు ఎప్పుడొస్తదో ఎవరు చూశారన్నారు. 80 ఏళ్ళ వయసున్న మనిషిని పట్టుకొని ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. నువ్వసలు మనిషివా, పశువువా అంటూ రేవంత్ పై ధ్వజమెత్తారు. రేవంత్ తోడబుట్టినవాళ్లంతా బతికే ఉన్నారా అని అడిగారు. ఆయన పాపాలు ఆయన్ను వెంబడిస్తున్నాయని శాపనార్థాలు పెట్టారు.

బిడ్డ పెళ్లిని కూడా తన అవసరాల కోసం వాడుకుని 6కోట్ల రూపాయలు అడుక్కున్న బిచ్చగాడివి నువ్వంటూ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు పొన్నాల లక్ష్మయ్య. "నీ.. మొహానికి ప్రజా సేవ అంటే తెలుసా? పైసల సేవ చేసే నువ్వు నా గురించి మాట్లాడతావా, నువ్వు కొడంగల్ లో గెలిచావా, అక్కడ తంతే మల్కాజిగిరి వచ్చి పోటీ చేశావు. అంత పోటు గాడివి అయితే మహబూబ్ నగర్ లో ఎందుకు పోటీ చెయ్యలేదు?" అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు పొన్నాల. కొడంగల్ లో ఒక కొత్త లీడర్ చేతిలో చావు దెబ్బ తిన్న నువ్వా నాకు చెప్పేది అంటూ రేవంత్ పై ఫైరయ్యారు. 50 కోట్ల రూపాయలు అధిష్టానానికి కప్పం చెల్లించి పీసీసీ పదవి తెచ్చుకున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ ఎంపీగా ఉన్న నియోజకవర్గ పరిధిలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు పొన్నాల. రేవంత్ పీసీసీ పదవి చేపట్టాక, ఒక్క ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ కి డిపాజిట్ వచ్చిందా అని అడిగారు. రాజీనామా తర్వాత కాస్త మర్యాదగానే మాట్లాడిన పొన్నాల, రేవంత్ రియాక్షన్ తర్వాత మాత్రం.. అంతకంటే ఎక్కువ ఘాటుగా స్పందించారు.

First Published:  14 Oct 2023 8:21 AM GMT
Next Story