Telugu Global
Telangana

పొంగులేటి నామినేషన్ కు ఐటీ అధికారుల అనుమతి

నామినేషన్ కు అనుమతి ఇచ్చినా కూడా అధికారులు ఇంకా పొంగులేటి నివాసం, కార్యాలయాల్లోనే ఉన్నారు. సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు సోదాలతో ఆందోళన చెందుతున్నా కూడా ఆయన భారీ ర్యాలీగా నామినేషన్ కు బయలుదేరడం విశేషం.

పొంగులేటి నామినేషన్ కు ఐటీ అధికారుల అనుమతి
X

నామినేషన్లు రేపటితో ఆఖరు అనుకున్న వేళ, ఈరోజే తెలంగాణలోని కీలక నేతలంతా ఆర్వో కార్యాలయాలకు పయనమవుతున్నారు. అయితే నామినేషన్ వేళ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థికి ఐటీ అధికారులు షాకిచ్చారు. ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఏక కాలంలో దాడులు చేశారు. ఆయన సమక్షంలోనే అధికారులు సోదాలు చేపట్టారు, ఆయన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఆయన నామినేషన్ విషయంపై సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన నామినేషన్ కు ఐటీ అధికారులు అనుమతినివ్వడం విశేషం.

కొనసాగుతున్న సోదాలు..

నామినేషన్ కు అనుమతి ఇచ్చినా కూడా అధికారులు ఇంకా పొంగులేటి నివాసం, కార్యాలయాల్లోనే ఉన్నారు. సోదాలు కొనసాగిస్తున్నారు. ఇటు సోదాలతో ఆందోళన చెందుతున్నా కూడా ఆయన భారీ ర్యాలీగా నామినేషన్ కు బయలుదేరడం విశేషం. వాస్తవానికి ఆయన నామినేషన్ రేపటికి వాయిదా పడుతుందని అనుకున్నారు కానీ.. దాడుల నేపథ్యంలో తాను వెనక్కి తగ్గలేదు అని చెప్పేందుకే ఈరోజే ఆయన నామినేషన్ కు బయలుదేరారని అంటున్నారు.

కక్షగట్టారు..

నామినేషన్ల వేళ కాంగ్రెస్ అభ్యర్థులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమైనందుకే ఇలా దాడులు చేస్తున్నారని అన్నారు. అటు పొంగులేటి కూడా ఐటీ దాడుల్ని రాజకీయ కక్షసాధింపు చర్యలుగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పై దాడులు జరుగుతాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకుల్ని ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి చర్యలు చేపట్టారని ఆరోపించారు. జైల్లో పెట్టినా తాను మాత్రం వెనక్కి తగ్గబోనన్నారు.

First Published:  9 Nov 2023 9:15 AM GMT
Next Story