Telugu Global
Telangana

హైదరాబాద్ కాలుష్యం: కొన్ని ప్రాంతాల్లో అత్యధికం, కొన్ని ప్రాంతాల్లో అత్యల్పం

ఫిబ్రవరికి సంబంధించిన తాజా కాలుష్య డేటా ఈ వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నది. బీరంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలు సంతృప్తికరమైన గాలి నాణ్యత కలిగి ఉన్నాయి. అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్, పాశమైలారం ప్రాంతాలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి.

హైదరాబాద్ కాలుష్యం: కొన్ని ప్రాంతాల్లో అత్యధికం, కొన్ని ప్రాంతాల్లో అత్యల్పం
X

కాలుష్యం విషయానికి వస్తే హైదరాబాద్ రెండు నగరాల మాదిరిగా ఉంది. కొన్ని ప్రాంతాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే, మరికొన్ని ప్రాంతాలు అధిక స్థాయి కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఫిబ్రవరికి సంబంధించిన తాజా కాలుష్య డేటా ఈ వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నది. బీరంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలు సంతృప్తికరమైన గాలి నాణ్యత కలిగి ఉన్నాయి. అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్, పాశమైలారం ప్రాంతాలు తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి.

జూ, పాశమైలారం పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అధిక స్థాయిలో ఉంది. ఫిబ్రవరి మొత్తం రీడింగ్‌లు 200 మార్క్‌ను దాటాయి. పారిశ్రామిక ఉద్గారాలు, వాహన కాలుష్యం, నిర్మాణ కార్యకలాపాల వల్ల ఈ ప్రాంతంలో అధిక కాలుష్యం నమోదయ్యింది.

పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల‌ పాశమైలారంలో కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయి. జూ పరిసరాలు భారీ ట్రాఫిక్ రద్దీ వలన అక్కడ గాలి నాణ్యత తగ్గుతుంది. చారిత్రాత్మకమైన చార్మినార్ ప్రాంతంలో కూడా అధిక కాలుష్యం నమోదయ్యింది. చార్మినార్ చుట్టూ భారీ ట్రాఫిక్ వల్ల AQI 119గా నమోదైంది. .

దీనికి విరుద్ధంగా, బీరంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాల్లో సమృద్ధిగా ఉన్న పచ్చటి ప్రదేశాలు, పారిశ్రామిక కార్యకలాపాలు తక్కువగా ఉండటం కాలుష్యం తక్కువగా ఉండటానికి కారణాలు.

అదేవిధంగా, కాసు బ్రహ్మానంద రెడ్డి (కెబిఆర్) నేషనల్ పార్క్, నాచారం, ఇసిఐఎల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో తక్కువ కాలుష్యం నమోదయ్యింది.

First Published:  9 March 2023 2:10 AM GMT
Next Story