Telugu Global
Telangana

బహిరంగ చర్చకు సవాళ్లు.. నిజామాబాద్ లో పొలిటికల్ టెన్షన్

తాజా సవాళ్లు నిజామాబాద్ లో పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ హడావిడికి కారణం అయిన బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ కి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఓ లేఖ రాశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావన్నారు.

బహిరంగ చర్చకు సవాళ్లు.. నిజామాబాద్ లో పొలిటికల్ టెన్షన్
X

నిజామాబాద్ లో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. అర్బన్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ విసిరిన సవాల్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా సీరియస్ గా తీసుకోవడంతో అసలు కథ మొదలైంది. నిజామాబాద్ లోని కంఠేశ్వర్ ఆలయం వద్ద బహిరంగ చర్చకు రావాలంటూ ధన్ పాల్ సవాల్ విసిరారు. నిజామాబాద్ అభివృద్ధిపై చర్చించడానికి తాను సిద్ధమని చెప్పారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా సిద్ధమేనా అంటూ రెచ్చగొట్టారు. అభివృద్ధి చేసిన తనకు భయమేంటని అన్నారు గణేష్ గుప్తా. చర్చకు వస్తానన్నారు. దీంతో ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైంది.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇటీవల బహిరంగ ప్రదేశంలో పెట్టిన టీవీ డిబేట్లలో ఎంత రచ్చ జరిగింతో అందరికీ తెలుసు. అభ్యర్థులు ఒకరినొకరు తిట్టుకున్నారు, తన్నుకున్నారు. దీంతో ఆ చర్చలను అక్కడితో ఆపివేశారు పోలీసులు. అనుమతిచ్చే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఇటీవల అభ్యర్థులపై జరిగిన దాడులు, నామినేషన్ల సందర్భంగా జరిగిన రచ్చ వల్ల పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇప్పుడు నిజామాబాద్ సవాళ్ల విషయంలో కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

తాజా సవాళ్లు నిజామాబాద్ లో పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ హడావిడికి కారణం అయిన బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ కి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఓ లేఖ రాశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావన్నారు. బహిరంగ చర్చకు వీలు లేదని చెప్పారు. ప్రత్యర్థులను బహిరంగ చర్చకు రావాలంటూ ధన్ పాల్ చేసిన సవాళ్లు తమ దృష్టికి వచ్చాయని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా అలాంటి చర్చలకు తాము అనుమతి ఇవ్వబోమన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ప్రత్యర్థులిద్దరూ ఒకేచోట చేరడం సరికాదని హితవుపలికారు. పోలీస్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First Published:  13 Nov 2023 7:21 AM GMT
Next Story