Telugu Global
Telangana

పొలిటికల్ గ్రాఫ్ సర్వే.. బీఆర్ఎస్ కి మద్దతిచ్చేది వీళ్లే

మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ 73 సీట్ల వరకు వరకు స్కోర్ చేసే అవకాశముంది, కాంగ్రెస్ 35, బీజేపీ 4, ఎంఐఎంకి 7 స్థానాలు వస్తాయని పొలిటికల్ గ్రాఫ్ సర్వే బయటపెట్టింది.

పొలిటికల్ గ్రాఫ్ సర్వే.. బీఆర్ఎస్ కి మద్దతిచ్చేది వీళ్లే
X

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాతో మరో సర్వే విడుదలైంది. ఈ సర్వేలో కూడా బీఆర్ఎస్ విజయం ఖామని తేలిపోయింది. పొలిటికల్ గ్రాఫ్ సర్వే సంస్థ కాసేపటి క్రితం తాము చేపట్టిన ఒపీనియన్ పోల్ వివరాలను బయటపెట్టింది. 40శాతం పైగా ఓట్ షేరింగ్ తో తెలంగాణలో ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కేసీఆరే మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సర్వే తేల్చి చెప్పింది.

40ఏళ్లు పైబడినవారి మద్దతు బీఆర్ఎస్ కే..

వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటం వల్ల బీఆర్ఎస్ పై ప్రజల్లో స్వల్ప స్థాయి వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని పొలిటికల్ గ్రాఫ్ సర్వే తేల్చి చెప్పింది. యువతలో బీఆర్ఎస్ పట్ల స్వల్ప వ్యతిరేకత ఉన్నా కూడా 40 ఏళ్లుపైబడిన వాళ్లు పూర్తిగా బీఅర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నారని తెలిపింది. మధ్యవయస్సువారు, వృద్ధులు కేసీఆర్ కి జై కొడుతున్నారని, తద్వారా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం నల్లేరుమీద నడకేనని స్పష్టం చేసింది.

మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ 73 సీట్ల వరకు వరకు స్కోర్ చేసే అవకాశముంది, కాంగ్రెస్ 35, బీజేపీ 4, ఎంఐఎంకి 7 స్థానాలు వస్తాయని పొలిటికల్ గ్రాఫ్ సర్వే బయటపెట్టింది. బీఆర్ఎస్ కి 40శాతంపైగా ఓట్ షేరింగ్ వస్తుందని, కాంగ్రెస్ కి 31.8 శాతం, బీజేపీకి 16.4 శాతం, ఎంఐఎంకి 3.2 శాతం ఓట్ షేరింగ్ లభిస్తుందని తెలిపింది.

First Published:  6 Nov 2023 4:40 PM GMT
Next Story