Telugu Global
Telangana

పొలిటికల్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు

ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పొలిటికల్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారు ప్రమాదం ఘటన సంచలనంగా మారింది. ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో సోహెల్ పై కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. అయితే ఘటన జరిగినప్పుడు పోలీసులు సోహెల్ ని అదుపులోకి తీసుకున్నా.. అతనిప్పుడు భారత్ లో లేడు. దుబాయ్ లో ఉన్నాడు. సోహెల్ ని దుబాయ్ తరలించేందుకు సహకరించారంటూ 10మందిపై పోలీసులు కేసు పెట్టారు. వీరిలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దుబాయ్ లో సోహెల్..

ప్రస్తుతం సోహెల్ దుబాయ్ లో ఉన్నాడు. అతడిని భారత్ కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో సోహెల్ ని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో సోహెల్ వేసిన క్వాష్ పిటిషన్‌ పై విచారణ జరిపిన కోర్టు అతడిని అరెస్ట్ చేయద్దని సూచించింది. ఈనెల 17న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సోహెల్ ని ధర్మాసనం ఆదేశించింది. ఈనెల 24కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.

కారు ప్రమాదం కేసులో సోహెల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కక్షసాధింపుతోనే ఎమ్మెల్యే పేరు కూడా చేర్చారని ఆయన అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. కారు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, బారికేడ్లను కారు ఢీకొన్న కేసులో ఇంత సీన్ క్రియేట్ చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. మొత్తమ్మీద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు ఈ కేసుతో హైలెట్ అవుతోంది.

First Published:  17 Jan 2024 9:14 AM GMT
Next Story