Telugu Global
Telangana

ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసిన పోచారం

2018లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో కేసీఆర్‌.. పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించి స్పీకర్‌గా నియమించారు.

ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసిన పోచారం
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గానీ స్పీకర్‌గా పనిచేసిన వారు తర్వాత జరిగే ఎన్నికల్లో విజయం సాధించరనే నమ్మకం బలంగా ఉండేది. అయితే తాజా ఎన్నికల్లో ఆ నమ్మకాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేశారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న పోచారం.. తాజా ఎన్నికల్లో బాన్సువాడ నుంచి మ‌రోసారి విజయం సాధించారు.

నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన రెండు స్థానాల్లో బాన్సువాడ ఒకటి కావడం గమనార్హం. గతంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాదెండ్ల మనోహర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓటమి చవిచూశారు.

2018లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో కేసీఆర్‌.. పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించి స్పీకర్‌గా నియమించారు. ప్రస్తుతం పోచారం గెలుపుతో పాత ఆనవాయితీకి అడ్డుకట్ట వేసినట్లయింది. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.

First Published:  3 Dec 2023 11:36 AM GMT
Next Story