Telugu Global
Telangana

ఓట‌మిని జీర్ణించుకోలేక కోర్టుకెక్కిన అభ్య‌ర్థులు.. హైకోర్టులో 30 పిటిష‌న్లు దాఖ‌లు

గెలిచిన ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్‌లో అవకతవకలు, ఈవీఎం, వీవీపాట్‌ సమస్యలను ప్రస్తావిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

ఓట‌మిని జీర్ణించుకోలేక కోర్టుకెక్కిన అభ్య‌ర్థులు.. హైకోర్టులో 30 పిటిష‌న్లు దాఖ‌లు
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావు ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీరితో పాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేల గెలుపును సవాల్ చేస్తూ 30 పిటిషన్లు దాఖలయ్యాయి. రానున్న రోజుల్లో ఈ పిటిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గెలిచిన ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్‌లో అవకతవకలు, ఈవీఎం, వీవీపాట్‌ సమస్యలను ప్రస్తావిస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

సిరిసిల్లలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కె.కె.మహేందర్‌ రెడ్డితో పాటు విద్యార్థి రాజకీయ పార్టీ అభ్యర్థి ఎల్‌.శ్రీనివాస్ కేటీఆర్‌ గెలుపును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును డిపెండెంట్‌గా చూపించలేదని మహేందర్ రెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు. సిరిసిల్లలో వీవీపాట్‌ మరోసారి లెక్కించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఇక సిద్దిపేటలో హరీష్‌ రావు గెలుపును సవాల్ చేస్తూ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హుజురాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గెలుపును మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ చేశారు. జూబ్లిహిల్స్‌లో మాగంటికి వ్యతిరేకంగా అజారుద్దీన్, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు గెలుపును సవాల్ చేస్తూ బండి రమేష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు గద్వాల్‌, ఆసిఫాబాద్‌, పటాన్ చెరు, కొత్తగూడెం, కామారెడ్డి, షాద్‌నగర్‌, ఆదిలాబాద్‌, మల్కాజిగిరితో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ గెలిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి.

First Published:  28 Jan 2024 6:14 AM GMT
Next Story