Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పవన్‌.. షెడ్యూల్ ఇదే..!

సురేందర్‌ రావుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు పవన్‌కల్యాణ్‌. తర్వాత కొత్తగూడెం నుంచి వరంగల్ వెళ్తారు. అక్కడ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు.

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారానికి పవన్‌.. షెడ్యూల్ ఇదే..!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారానికి సంబంధించి జనసేనాని షెడ్యూల్ ఫైనల్ అయింది. ప్ర‌చారంలో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించ‌నున్న నియోజ‌క‌వ‌ర్గాల లిస్ట్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. రేపటి నుంచి తెలంగాణలో ఎన్నిక‌ల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు జనసేనాని.

రేపు ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ రావుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు పవన్‌కల్యాణ్‌. తర్వాత కొత్తగూడెం నుంచి వరంగల్ వెళ్తారు. అక్కడ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సంకినేని వెంక‌టేశ్వ‌ర‌రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించాల్సిందిగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం నిర్వ‌హిస్తారు.



తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది బీజేపీ. జనసేనకు కేటాయించిన స్థానాల్లో కూకట్‌పల్లి, కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, నాగర్‌కర్నూలు ఉన్నాయి.

First Published:  21 Nov 2023 2:05 PM GMT
Next Story