Telugu Global
Telangana

పేపర్ లీక్ కేసు: 42 మంది TSPSC ఉద్యోగులకు సిట్ నోటీసులు

ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని ముందుగా అనుకున్న పోలీసులకు మరో పది మంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 పరీక్ష రాశారని తెలిసింది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.

పేపర్ లీక్ కేసు: 42 మంది TSPSC ఉద్యోగులకు సిట్ నోటీసులు
X

TSPSC పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను అనేక సార్లు విచారించిన సిట్ వారితో సన్నిహితంగా ఉన్న 42 మంది TSPSC ఉద్యోగులకు ఈ రోజు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి శంకర్ లక్ష్మిని అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రేపు మరోసారి ఆమె స్టేట్ మెంట్ ను తీసుకోనున్నారు.

ఇప్పుడిక TSPSC కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్ లతో సన్నిహితంగా ఉండే వాళ్ళ లిస్ట్ తయారు చేసింది సిట్ బృందం. ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని ముందుగా అనుకున్న పోలీసులకు మరో పది మంది ఉద్యోగులు కూడా గ్రూప్ 1 పరీక్ష రాశారని తెలిసింది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. దాంతో మొత్తం 42 మంది ఉద్యోగులను విచారించేందుకు సిట్ సిద్దమయ్యింది.

మరో వైపు మరో నిందితురాలు రేణుక, ఆమె భర్త డాక్యానాయక్ లు ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఆ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్న‌పలువురు అభ్యర్థులను కూడా సిట్ విచారించనున్నట్టు సమాచారం.

రాజశేఖర్ స్నేహితుడైన సురేష్ పాత్రపై కూడా సిట్ విచారణ జరుపుతోంది. రాజశేఖర్ సురేష్ కు ప్రశ్నాపత్రం ఇచ్చినట్టు ఇప్పటికే తేలింది. అయితే ఆ ప్రశ్న పత్రాన్ని సురేష్ ఎవరెవరికి ఇచ్చాడన్న దానిపై సిట్ విచారణ చేస్తోంది.

First Published:  22 March 2023 3:05 PM GMT
Next Story