Telugu Global
Telangana

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఒవైసీ స్పంద‌న ఇదే..

అమిత్ షా మాట్లాడిన‌దానిలో ముస్లిం వ్యతిరేక ప్రసంగం త‌ప్ప తెలంగాణ‌పై బీజేపీకి విజ‌న్ లేద‌ని ఒవైసీ అన్నారు. వారు అందించగలిగేదంతా బూటకపు ఎన్‌కౌంటర్లు, హైదరాబాద్‌పై సర్జికల్ దాడులు, కర్ఫ్యూలు, క్రిమినల్స్, ఇంకా బుల్‌డోజర్‌లను విడుదల చేయడమేన‌ని విమ‌ర్శించారు.

అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ఒవైసీ స్పంద‌న ఇదే..
X

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే ముస్లిం కోటాను రద్దు చేస్తామ‌ని కేంద్ర హొం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒవైసీ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ సమీపంలోని చేవెళ్లలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ.. మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం కోటాను తొలగిస్తుందన్నారు.


షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఆ రిజ‌ర్వేష‌న్‌ హక్కు కల్పిస్తామని చెప్పారు. మజ్లిస్‌కు మేం భయపడం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం నడుస్తుంది. ఒవైసీ కోసం నడవదు అని షా అన్నారు.

దీనిపై సోమ‌వారం ఒవైసీ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజలను బీజేపీ ఎందుకు అంతగా ద్వేషిస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అమిత్ షా మాట్లాడిన‌దానిలో ముస్లిం వ్యతిరేక ప్రసంగం త‌ప్ప తెలంగాణ‌పై బీజేపీకి విజ‌న్ లేద‌ని అన్నారు. వారు అందించగలిగేదంతా బూటకపు ఎన్‌కౌంటర్లు, హైదరాబాద్‌పై సర్జికల్ దాడులు, కర్ఫ్యూలు, క్రిమినల్స్, ఇంకా బుల్‌డోజర్‌లను విడుదల చేయడమేన‌ని విమ‌ర్శించారు.

ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు న్యాయం చేయడంపై షా సీరియస్‌గా ఉన్నట్లయితే, 50% కోటా సీలింగ్‌ను తొలగించేందుకు రాజ్యాంగ సవరణను తీసుకురావాలని ఒవైసీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

First Published:  24 April 2023 6:29 AM GMT
Next Story