Telugu Global
Telangana

ఆ పేదోడి పాలిట దేవుళ్ళ‌యిన ఉస్మానియా వైద్య‌బృందం!

జార్ఖండ్‌కు చెందిన శంషాద్‌ (35) కొంతకాలంగా ఆబిడ్స్‌లోని ఓ భవన నిర్మాణంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. అక్కడున్న ఇనుప రాడ్లు శంషాద్‌ పొట్టలో గుచ్చుకుని అటునుంచి ఇటు చొచ్చుకువ‌చ్చాయి.

ఆ పేదోడి పాలిట దేవుళ్ళ‌యిన ఉస్మానియా వైద్య‌బృందం!
X

తెలంగాణ‌లో అందుతున్న వైద్య సేవ‌ల కోసం దేశంలోని వివిద రాష్ట్రాల నుంచే గాక విదేశాల నుంచి కూడా ఎంతో మంది రోగులు హైద‌రాబాద్ కు వ‌చ్చి చికిత్స చేయించుకుని సుర‌క్షితంగా సంతోషంతో తిరిగి వెళుతుంటారు. ప్రైవేటు వైద్య రంగంలోనే గాక ప్ర‌భుత్వ వైద్య రంగంలో ఎన్నో ఆధునిక చికిత్సా ప‌రిక‌రాలు, సౌక‌ర్యాలు అందుబాటులోకి రావ‌డంతో ఉస్మానియా, గాంధీ ద‌వాఖాన‌లు పేద‌ల పాలిట పెన్నిధిగా నిలుస్తూ ప్రాణాలు పోస్తున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్ప‌త్రిలో వైద్యులు అందించిన వైద్య సేవ‌లు ఓ పేద కార్మికుడి జీవితాన్ని నిలిపింది. అత‌ని పాలిట ఆ వైద్యులు దేవుళ్ళే అయ్యారు.

జార్ఖండ్‌కు చెందిన శంషాద్‌ (35) కొంతకాలంగా ఆబిడ్స్‌లోని ఓ భవన నిర్మాణంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. అక్కడున్న ఇనుప రాడ్లు శంషాద్‌ పొట్టలో గుచ్చుకుని అటునుంచి ఇటు చొచ్చుకువ‌చ్చాయి. వెంట‌నే అత‌నిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సీటీ స్కాన్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ శ్రీనివాస్‌, యూరాలజీ డాక్టర్‌ నితీష్‌, సర్జికల్‌ గ్రాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్‌ ఆదిత్య, జనరల్‌ సర్జరీ, అనస్తీషియా డాక్టర్‌ అజితలతో కూడిన మల్టీ డిసిప్లినరీ వైద్యబృందం శస్త్రచికిత్సను నిర్వహించింది. శ‌స్త్ర చికిత్స‌లో శంషాద్‌కు అవసరమైన రక్తాన్ని హెల్పింగ్‌ హ్యాండ్‌ ప్రతినిధులు సేకరించగా, ఉస్మానియా వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు.ఐదు గంటల పాటు శ్రమించి రాడ్లను తొలగించి ప్రాణాలు కాపాడారు. కడుపులోకి చొచ్చుకెళ్లిన రాడ్ల కారణంగా చిన్న పేగులకు చిల్లులుపడ్డాయని, చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు.

First Published:  28 Nov 2022 7:47 AM GMT
Next Story