Telugu Global
Telangana

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటే చారిత్రక న్యాయం..

తెలంగాణ చరిత్రతో, పరిణామాలతో.. ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టి ప్రజల భావోద్వేగాలను గాయపరచవద్దని వారు లేఖలో కోరారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటే చారిత్రక న్యాయం..
X

తెలంగాణ నూతన సెక్రటేరియట్ ముందు ఎవరి విగ్రహం ఉండాలి..? తెలంగాణ అస్తిత్వ వైభవానికి, స్వరాష్ట్ర ప్రతిపత్తికి, స్వాభిమానానికి, సాధికారతకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా, లేక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా.. అనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకి అన్ని ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని తేల్చి చెప్పింది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా దాన్ని మార్చేస్తామని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరాఖండిగా చెప్పేశారు. అసలు తెలంగాణ ప్రజలు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు..? కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవుల అభిప్రాయం ఏంటి..? వారంతా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటే సముచితం అంటున్నారు. సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయం అని చెబుతున్నారు. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ప్రజల భావోద్వేగాలను గాయపరచినట్టేనని అన్నారు. వారంతా కలసి రాహుల్ గాంధీకి ఓ బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణలో నూతన సెక్రటేరియట్ నిర్మించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. అధికారం మారడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. ప్రజలనుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడంలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఈ విషయాన్ని తెలియజేసేలా, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరచొద్దని చెబుతూ.. కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవులు లేఖ రాశారు.

తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదని, తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెళ్ళ వెంకటరామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలు, పాటలు రచించారని వారు గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునర్జీవం పొందిందని తమ లేఖలో పేర్కొన్నారు. సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా, సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగుతల్లిని నిలిపే ప్రయత్నం చేశారన్నారు. దీనికి ప్రతిగా తెలంగాణ బుద్ధిజీవులు, సాహిత్యకారులు, కళాకారులు.. తెలంగాణ తల్లి రూపురేఖల గురించి చర్చించి ఇప్పుడున్న తుది రూపాన్నిచ్చారని అన్నారు. ఉద్యమ సమయంలో స్వచ్ఛందంగా తెలంగాణలో వేలాది విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లి ఈ మట్టిలోనుంచి, తెలంగాణ ఉద్యమ భావోద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీక అని రాహుల్ గాంధీకి తమ లేఖతో గుర్తు చేశారు.

సమైక్య రాష్ట్రంలో సెక్రటేరియట్ ముందు తెలుగుతల్లి విగ్రహం ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి, నూతన సెక్రటేరియట్ భవనం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నేడు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయం అని చెప్పారు కవులు, కళాకారులు, బుద్ధిజీవులు. సెక్రటేరియట్ కు అమరవీరుల స్మారక కేంద్రానికి మధ్య ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ కవులు, కళాకారులు, పాత్రికేయుల పక్షాన రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై తమకు గౌరవం ఉందని, నగరంలో ఆయన విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నామని, అయితే సెక్రటేరియట్ ముందు ఆ విగ్రహం పెట్టడంపై తమకు అభ్యంతరాలున్నాయని చెప్పారు కవులు, కళాకారులు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ప్రతిష్టించాలని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరెక్కడైనా ప్రతిష్టించాలని కోరారు. తెలంగాణ చరిత్రతో, పరిణామాలతో.. ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టి ప్రజల భావోద్వేగాలను గాయపరచవద్దని వారు లేఖలో కోరారు. ఎన్నికల సమయంలో తెలంగాణ సాంస్కృతిక ఆకాంక్షలను గౌరవిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. నేడు ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సూచించాలని కోరుకుంటున్నట్టుగా వారు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక ఆకాంక్షలకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవుల పక్షాన

ప్రొఫెసర్ హరగోపాల్

టంకశాల అశోక్

అల్లం నారాయణ

గోరెటి వెంకన్న

మల్లేపల్లి లక్ష్మయ్య

నందిని సిధారెడ్డి

అయాచితం శ్రీధర్

పరాంకుశం వేణుగోపాల స్వామి

నాళేశ్వరం శంకరం

దేశపతి శ్రీనివాస్

ఘంటా చక్రపాణి

కట్టా శేఖర్ రెడ్డి

తిగుళ్ళ కృష్ణమూర్తి

కూతురు శ్రీనివాస్ రెడ్డి

వెంకట్ వర్దెల్లి

ప్రొఫెసర్ దంటు కనకదుర్గ

రసమయి బాలకిషన్

సంగిశెట్టి శ్రీనివాస్

ఏలె లక్ష్మణ్

శ్రీధర్ రావు దేశ్ పాండే

బుద్ధా మురళి

ఎస్జీవీ శ్రీనివాస్ రావు

అనిశెట్టి రజిత

ఐనంపూడి శ్రీలక్ష్మి

కొమర్రాజు రామలక్ష్మి

శ్రీదేవి మంత్రి

రాజ్యశ్రీ కేతవరపు

మంగళంపల్లి విశ్వేశ్వర్

పెద్దింటి అశోక్ కుమార్

వేముగంటి మురళి

కందుకూరి శ్రీరాములు

మల్లావఝుల విజయానంద్

డాక్టర్ ఆంజనేయ గౌడ్

బద్రి నర్సన్

శ్రీరామోజు హరగోపాల్

రమేశ్ హజారి

కాంచనపల్లి

నవీన్ ఆచారి

జూలూరి గౌరీశంకర్

వఝుల శివకుమార్

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

వేముగంటి మురళీకృష్ణ

ధ్యావనపల్లి సత్యనారాయణ

పెన్నా శివరామకృష్ణ

కోట్ల వెంకటేశ్వర రెడ్డి

లక్ష్మణ్ గౌడ్

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

వనపట్ల సుబ్బయ్య

లక్ష్మణ్ మురారి (బందూక్)

కార్టూనిస్ట్ మృత్యుంజయ్

చిమ్మని మనోహర్

ఎదిరెపల్లి కాశన్న

డా.ఎ.జయంతి

స్వర్ణ కిలారి

బోల యాదయ్య

కె.వీరయ్య

యన్.బాల్ రాం

ఉప్పరి తిరుమలేష్

అమర్ నాథ్

చిక్కొండ్ర రవి

బైరోజు చంద్రశేఖర్

బైరోజు రాజశేఖర్

బైరోజు శ్యాంసుందర్

వహీద్ ఖాన్

వేదార్థం మధుసూదన శర్మ

ఆర్.రత్నాకర్ రెడ్డి,

సి.హెచ్.ఉషారాణి

బెల్లంకొండ సంపత్ కుమార్

పొన్నాల బాలయ్య

కె.అంజయ్య

సిద్దెంకి యాదగిరి

చమన్ సింగ్

కె.రంగాచారి

తైదల అంజయ్య

నాగిళ్ల రామశాస్త్రి

హిమజ్వాల (ఇరివెంటి వెంకట్రమణ)

ఘనపురం దేవేందర్

వీరేంద్ర కాపర్తి

ప్రగతి

పరదా వెంకటేశ్వర్ రావు

ఆచార్య పిల్లలమర్రి రాములు

సంగాని మల్లేశ్వర్... ఈ లేఖను రాశారు..

First Published:  20 Aug 2024 1:47 AM GMT
Next Story