Telugu Global
Telangana

'వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్..' మోడీ కొత్త పథకం -కేటీఆర్‌ ట్వీట్‌

శ్రీలంకలోని అదానీ ప్రాజెక్టు 'ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం'అని ఆ దేశ ఆర్థిక మంత్రి ఓ ప్రకటన చేశారు. పత్రికల్లో వచ్చిన ఆ ప్రకటనను ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్, భారత ప్రధాని మోడీ ఒత్తిడి వల్లనే అదానీకి ఆ ప్రాజెక్టును ఇవ్వాల్సి వచ్చిందని గతంలో శ్రీలంక అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్.. మోడీ కొత్త పథకం -కేటీఆర్‌ ట్వీట్‌
X

కేంద్ర బీజేపీ సర్కార్, ప్రధానిమోడీపై విమర్శలతో విరుచుకపడే తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో సారి మోడీ, అదానీల స్నేహంపై వ్యంగ్యంగా స్పందించారు. శ్రీలంక లో అదానీ విద్యుత్ ప్రాజెక్టుపై ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటనను షేర్ చేసిన కేటీఆర్, 'వన్‌ నేషన్‌.. వన్‌ ఫ్రెండ్..' ఇది మోడీ కొత్త పథకం అని ట్వీట్ చేశారు.

శ్రీలంకలోని అదానీ ప్రాజెక్టు 'ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం'అని ఆ దేశ ఆర్థిక మంత్రి ఓ ప్రకటన చేశారు. పత్రికల్లో వచ్చిన ఆ ప్రకటనను ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్, భారత ప్రధాని మోడీ ఒత్తిడి వల్లనే అదానీకి ఆ ప్రాజెక్టును ఇవ్వాల్సి వచ్చిందని గతంలో శ్రీలంక అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

శ్రీలంక అదానీ ప్రాజెక్టు నేపథ్యంలో... ఒక దేశం ఒకే ఎన్నిక, ఒక దేశం ఒకే చట్టం తదితర నినాదాలిస్తున్న మోడీ సర్కార్ పై వ్యగ్యంగా స్పందిస్తూ, అలాగే అమృత కాల్ అనే నినాదాన్ని కూడా విమర్శిస్తూ, ''ఈ మిత్రకాల్ లో వన్‌ నేషన్‌ .. వన్‌ ఫ్రెండ్ (ఒక దేశం ఒకే మిత్రుడు) అనేది కొత్త పథకం'' అని ట్వీట్ చేశారు కేటీఆర్.

First Published:  6 March 2023 10:14 AM GMT
Next Story