Telugu Global
Telangana

ఎల్లుండి KCR అధ్యక్షతన BRS పార్లమెంటరీ, శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం భేటీ..!

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున, ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

ఎల్లుండి KCR అధ్యక్షతన BRS పార్లమెంటరీ, శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం భేటీ..!
X

ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ‌ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌ల చైర్మన్లు హాజరుకావాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున, ఈ సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

మరో వైపు, రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించడమే కాకుండా వాటి అమలుకు సంబంధించిన కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ కోటా కింద రాష్ట్ర శాసనమండలికి నామినేట్ కానున్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను కూడా ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.

First Published:  8 March 2023 4:28 PM GMT
Next Story