Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికలు.. గ్రేటర్ పై అధికారుల స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18 చెక్ పోస్ట్ ​లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించారు. 15 వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఎన్నికలు.. గ్రేటర్ పై అధికారుల స్పెషల్ ఫోకస్
X

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అధికారులు ఎక్కడికక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక ఫోకస్ పెడతామంటున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించాలని నిర్ణయించారు. నగరం చుట్టుపక్కల చెక్ పోస్ట్ లను కట్టుదిట్టం చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18 చెక్ పోస్ట్ ​లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించారు. 15 వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు అధికారులు. హైదరాబాద్ పరిధిలో 1688 ప్రాంతాల్లో 3986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1587 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని.. 32 కేంద్ర బలగాలను అడిగామని చెప్పారు. లైసెన్స్డ్ గన్స్ ఉన్నవారు వెంటనే పోలీస్ స్టేషన్లలో వాటిని డిపాజిట్ చేయాలని సూచించారు. ఎన్నికల తర్వాత వాటిని తిరిగి తీసుకోవచ్చని చెప్పారు.

బైండోవర్లు..

ఇప్పటి వరకు 652 మందిని బైండోవర్ చేశామని చెప్పారు కమిషనర్ సీవీ ఆనంద్. 18 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని, 2,252 నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేశామని తెలిపారు. వాహనాలు తనిఖీలు చేసే సందర్భాల్లో వాహనదారులు సహకరించాలని కోరారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  10 Oct 2023 11:01 AM GMT
Next Story