Telugu Global
Telangana

ప్రవీణ్ సెల్‌లో మహిళల న్యూడ్ ఫొటోలు.. లక్ష్మీని ట్రాప్ చేసి ఐడీ, పాస్‌వర్డ్ దొంగతనం?

రాజశేఖర్, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ కలిసి ఈ మొత్తం తతంగం నడిపించినట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ లక్ష్మీని ట్రాప్ చేసి ఆమె దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగిలించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

ప్రవీణ్ సెల్‌లో మహిళల న్యూడ్ ఫొటోలు.. లక్ష్మీని ట్రాప్ చేసి ఐడీ, పాస్‌వర్డ్ దొంగతనం?
X

టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షల లీకేజీ కేసు దర్యాప్తులో పోలీసులకు రోజుకో ట్విస్ట్ తెలుస్తోంది. ఇప్పటికే పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రోజుకో విషయం బయటపడుతుండటంతో అధికారులు కూడా విస్తు పోతున్నారు. పేపర్ లీకేజీల కేసులో కొంత మంది రాజకీయ నాయకుల ఫొటోలు కూడా లభ్యమయినట్లు సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. లీకేజీ కేసులో రాజకీయ నాయకుడు అయిన రాజశేఖర్ పాత్ర కీలకంగా మారిందని అధికారులు అంటున్నారు.

రాజశేఖర్, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ కలిసి ఈ మొత్తం తతంగం నడిపించినట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ లక్ష్మీని ట్రాప్ చేసి ఆమె దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగిలించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఇలా దొంగిలించిన క్రెడెన్షియల్స్ సహాయంతోనే ప్రవీణ్ ఐదు ప్రశ్నాపత్రాలను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏయే పేపర్లు లీక్ అయ్యాయనే విషయంపై కూడా లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక కాపీ చేసుకున్న ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ ఎవరెవరికి ఇచ్చారనే విషయంపై కూడా విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత.. దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గత వారం ప్రవీణ్‌ను విచారించిన తర్వాత అనేక విషయాలు వెలుగు చూశాయి. ప్రవీణ్ ఫోన్‌లో అత్యధిక సంఖ్యలో మహిళల నెంబర్లు కూడా గుర్తించారు.

ఇక ప్రవీణ్ వాట్సప్ చాటింగ్‌లో ఎక్కువగా మహిళల న్యూడ్ ఫొటోలు, ఇతర అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు షాక్ తిన్నారు. నిందితుడు ప్రవీణ్‌కు మహిళల పట్ల ఆకర్షణ ఎక్కువని.. వాళ్లను ఎక్కువగా ట్రాప్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్ టీఎస్‌పీఎస్సీలో 2017లో చేరాడు. అప్పట్లో వెరిఫికేషన్ సెక్షన్‌లో పని చేసేవాడు. వెరిఫికేషన్‌కు వచ్చే మహిళల నెంబర్లు తీసుకొని.. దరఖాస్తు సమయంలో వచ్చే సాంకేతిక సమస్యలను పరిష్కరించేవాడు. అలా వారితో సాన్నిహిత్యం పెంచుకున్నాడని పోలీసులు తేల్చారు.

ఎక్కువ మంది మహిళలతో సాన్నిహిత్యంగా ఉండటమే కాకుండా.. కొంత మంది నగ్న దృశ్యాలు కూడా ఫోన్‌లో సేవ్ చేసుకున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. రేణుకతో పరిచయం పెరిగిన తర్వాత.. ఆమె చెప్పినందుకే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్, రేణుల ఫోన్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిన దగ్గర నుంచి జరిగిన చాట్‌ను పోలీసులు రికవరీ చేసే పనిలో ఉన్నారు. కాగా, ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలీమ్స్ రాశాడని.. అందులో 103 మార్కులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ పరీక్ష పేపర్ లీక్ అయ్యిందా లేదా అనే విషయాలు ఇంకా తెలియలేదు. తాజాగా, అధికారులు గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

First Published:  17 March 2023 9:36 AM GMT
Next Story