Telugu Global
Telangana

తెలంగాణకు పెట్టుబడులు రావడానికి ఎన్నారైలు కృషి చేయాలి : కేటీఆర్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిన కేటీఆర్ అక్కడ ప్ర‌వాస భార‌తీయుల‌తో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. స్విట్జ‌ర్‌లాండ్‌లోని జ్యూరిక్‌ న‌గ‌రంలో ప్ర‌వాస భార‌తీయులు జ‌న‌వ‌రి 15న (ఆదివారం) నిర్వ‌హించిన‌ మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ పాల్గొన్నారు.

తెలంగాణకు పెట్టుబడులు రావడానికి ఎన్నారైలు కృషి చేయాలి : కేటీఆర్
X

ఈ ఎనిమిదేళ్ళ కాలంలో తెలంగాణ వేగవంతమైన, అద్భుతమైన అభివృద్దిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, అయితే మరిన్ని పెట్టుబడులు రాబట్టడానికి ఎన్నారైలు మరింతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిన కేటీఆర్ అక్కడ ప్ర‌వాస భార‌తీయుల‌తో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. స్విట్జ‌ర్‌లాండ్‌లోని జ్యూరిక్‌ న‌గ‌రంలో ప్ర‌వాస భార‌తీయులు జ‌న‌వ‌రి 15న (ఆదివారం) నిర్వ‌హించిన‌ మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ పాల్గొన్నారు. ఈ స‍ందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నారైలు ఇస్తున్న మద్దతు గొప్పగా ఉందన్నారు. ఈ మద్దతు ఇలాగే కొనసాగించి, తెలంగాణ ప్ర‌భుత్వ విధానాల‌ను విదేశాల్లో ప్ర‌చారం చేసి, రాష్ట్రానికి పెట్టుబడులు వ‌చ్చేందుకు కృషి చేయాలని ఆయ‌న కోరారు.

దేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, రైతులకు 24 గంట‌ల ఉచిత క‌రెంటు ఇస్తున్నామ‌ని, హ‌రిత హారంతో రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం 7.7 శాతం పెరిగింద‌ని మంత్రి వెల్ల‌డించారు.కాళేశ్వ‌రం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

First Published:  16 Jan 2023 5:54 AM GMT
Next Story