Telugu Global
Telangana

తెలంగాణలో ఫిబ్రవరి 10 నాటికి మరో 11,000 పోస్టులకు నోటిఫికేషన్

ఇప్పటికే 8,710 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించడానికి బోర్డు సిద్ధంగా ఉండగా, వాటికి అదనంగా మరో 2,000 పోస్టుల‌ను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల‌ అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్‌లు అందుతాయి.

తెలంగాణలో ఫిబ్రవరి 10 నాటికి మరో 11,000 పోస్టులకు నోటిఫికేషన్
X

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ - రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) ఫిబ్రవరి 10 నాటికి దాదాపు 11,000 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నది.

ఇప్పటికే 8,710 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్లు ప్రకటించడానికి బోర్డు సిద్ధంగా ఉండగా, వాటికి అదనంగా మరో 2,000 పోస్టుల‌ను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల‌ అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్‌లు అందుతాయి.

"ప్రస్తుతం ఉన్న 8,710 ఖాళీలను తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అయితే మరిన్ని పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. ఆర్థిక శాఖ నుండి కొత్త ఖాళీలకు ఆమోదం పొందిన తర్వాత, సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో దాదాపు 11,000 ఖాళీలకు ఫిబ్రవరి 10 లోపు నోటిఫికేషన్ జారీచేస్తారు ”అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్న‌ పోస్టులలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, స్కూల్ ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లు ఉన్నారు. లైబ్రేరియన్లు, కళలు, సంగీతం, చేతిపనుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా బోర్డు సిద్దంగా ఉంది.

అధికారిక వర్గాల ప్రకారం, బోర్డు వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం ప్రశ్నపత్రం నమూనా, సిలబస్‌ను ఖరారు చేస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతుల‌ ప్రారంభానికి ముందే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయడానికి, సంబంధిత విద్యా సంస్థలకు కొత్త సిబ్బందిని కేటాయించడాడానికి ప్రణాళికలను రూపొందించింది.

TREI-RBకి టీచింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ బాధ్యతను అప్పగించగా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) , తెలంగాణ మెడికల్ & హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో నాన్ టీచింగ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి.ఇప్పటికే 8,710 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించడానికి బోర్డు సిద్ధంగా ఉండగా, వాటికి అదనంగా మరో 2,000 పోస్టుల‌ను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల‌ అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్‌లు అందుతాయి.

First Published:  27 Jan 2023 2:28 AM GMT
Next Story