Telugu Global
Telangana

సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ - కవిత

ఎమ్మెల్సీ కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరిచారు. తాజాగా కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ - కవిత
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు బయట మాట్లాడుతున్న విషయాలనే లోపల అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు కవిత. ఒకటే విషయాన్ని అధికారులు పదే పదే అడుగుతున్నారంటూ మండిపడ్డారు.

ఎమ్మెల్సీ కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరిచారు. తాజాగా కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోసారి కవితను అధికారులు తిహార్‌ జైలుకు తరలించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తిహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే గురువారం సీబీఐ అధికారులు కవితను అరెస్టు చేశారు. కవిత రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది.

First Published:  15 April 2024 5:56 AM GMT
Next Story