Telugu Global
Telangana

హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ మాదే..

కొవిడ్ సమయంలో అప్పులు చేసి మరీ భవిష్యత్ పై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగించిందని చెప్పారు నిర్మలా సీతారామన్. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. తెలంగాణ అభివృద్ధి క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ మాదే..
X

హైదరాబాద్ అభివృద్ధి ఘనత తమదేనంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వ పాలసీల వల్లే హైదరాబాద్ కి మంచి మంచి కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన సమయానికి తెలంగాణ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని, అప్పటికే అభివృద్ధికి సెంటర్ గా హైదరాబాద్ మారిందని చెప్పారామె. అత్యధిక ఆదాయం వచ్చే తెలంగాణను అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మీడియా సమావేశం నిర్వహించారు నిర్మలమ్మ. హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు.


ఇటీవల పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామంటూ బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచిన బీజేపీ, తెలంగాణలో కేవలం ఎన్నికల కోసం వ్యాట్ తగ్గిస్తామని చెబుతోందని వైరి వర్గాలంటున్నాయి. ఈ విమర్శలపై కూడా నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ మీద వ్యాట్ వేసింది తెలంగాణ అని, కేంద్రం కాదని ఆమె చెప్పారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు చాలా కీలకమని అంటున్న ఆమె, ఈ ఎన్నికల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

కొవిడ్ సమయంలో అప్పులు చేసి మరీ భవిష్యత్ పై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగించిందని చెప్పారు నిర్మలా సీతారామన్. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి తొలిసారిగా వచ్చిన ఆమె పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. జూబ్లీహిల్స్ నుంచి తన ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. తెలంగాణ అభివృద్ధి క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నారు.


First Published:  21 Nov 2023 7:16 AM GMT
Next Story