Telugu Global
Telangana

కేసీఆర్ పాలనలోని ఈ తొమ్మిదేళ్లు గిరిజనులకు స్వర్ణయుగం : సత్యవతి రాథోడ్

స్వాతంత్రం వచ్చాక 67 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే కేవలం 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఒక ఎత్తు అని రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

కేసీఆర్ పాలనలోని ఈ తొమ్మిదేళ్లు గిరిజనులకు స్వర్ణయుగం : సత్యవతి రాథోడ్
X

స్వాతంత్రం వచ్చాక 67 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే కేవలం 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఒక ఎత్తు అని రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనులకు ఈ 9 సంవత్సరాలు స్వర్ణయుగం అన్నారు. మంగళవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ... ఆడపిల్ల పుడితే గిరిజనులు పేదరికంతో పెళ్ళిలు చేయలేక, పోషించలేక అమ్ముకునే వారని కానీ కేసీఆర్ ప్రభుత్వం లక్ష నూట పదహారు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకుంటున్నారన్నారని తెలిపారు.

చెంచులకు, గిరిజనులకు ఆరోగ్యం కొరకు పల్లె దవాఖనాలు, 132 రకాల వైద్య నిర్ధారణ పరీక్ష కేంద్రం, విద్య కొరకు గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు.. రాష్ట్రంలో 25 నియోజక వర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 2 కోట్ల వ్యయంతో సేవాలాల్ గిరిజన భవనాలు నిర్మించేందుకు మంజూరు చేయడం జరిగిందన్నారు. 1976 నుండి 2023 వరకు గిరిజన రిజర్వేషన్ పై సమీక్ష నిర్వహించలేదని, తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ ను 6 నుండి 10 శాతానికి పెంచిందని తెలిపారు. గురుకుల పాఠశాల లకు 240 కోట్లు, ప్రతి యూనివర్సిటీ లో హాస్టల్ వసతులకు 140 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

అంతకు ముందు మంత్రి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మన్ననూర్ గిరిజన తండాల్లో పర్యటించిన మంత్రి రూ. 85.5 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. దీనితో పాటు సి.టి.డి. ఎ ద్వారా చెంచుల జీవనోపాధి కోసం 250 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల విలువ చేసే యూనిట్లను అందజేశారు. అదేవిధంగా ఆర్.డి.టి ద్వారా 250 కుటుంబాలకు లక్ష రూపాయల విలువ గల యూనిట్లను పంపిణీ చేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో చెంచులక్ష్మి రెస్టారెంట్, గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా రు. 90 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యాధి నిర్ధారణ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. చెంచులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.

అనంతరం షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి రూ. 2.25 కోట్ల అంచనాలతో చెంచుపల్గు తాండా నుండి లక్ష్మాపూర్ వరకు 2.4 కి.మి. బి.టి రోడ్డు, లక్ష్మాపుర్ నుండి శంకరయ్య గుట్ట తాండకు 105 లక్షలతో బి.టి రోడ్డుకు శంఖుస్థాపన చేశారు. తండాలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లంబాడీ మహిళలతో కలిసి మంత్రి గిరిజన నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు.

జాజల తాండా బి.టి రోడ్డుకు, సర్వరెడ్డి పల్లి తాండా కు, దాస్య తండా కు,గుట్టమీద రెసిడెన్షియల్ స్కూల్ కు బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చెంచుల స్వయం ఉపాధి, వారి ఆర్థిక సాధికారత కొరకు అమరగిరి ఫిష్ స్టోరేజ్ యూనిట్ కు రూ. 35 లక్షలు, ఎల్గూర్ ఫిష్ స్టోరేజ్ యూనిట్ కు రూ. 35 లక్షలు, రేకుల వలయం ఫిష్ స్టోరీజ్ కు రూ. 35 లక్షలు, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ కు రూ. 5.5 లక్షలు, హాని యూనిట్ కు రూ. 2.70 లక్షల విలువ గల సామాగ్రిని పంపిణీ చేశారు.

First Published:  16 May 2023 8:33 PM GMT
Next Story