Telugu Global
Telangana

నెదర్లాండ్స్ ప్రభుత్వంతో నిమ్స్ భాగస్వామ్యం.. యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్‌పై అధ్యయనం

నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందం నిరుడు నవంబర్‌లో ఒక సారి నిమ్స్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో యాంటీ బయోటిక్స్ వాడకం.. యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్‌పై అధ్యయనం చేశారు.

నెదర్లాండ్స్ ప్రభుత్వంతో నిమ్స్ భాగస్వామ్యం.. యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్‌పై అధ్యయనం
X

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)తో నెదర్లాండ్స్ ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యింది. ఆ దేశానికి చెందిన హెల్త్ మినిస్ట్రీ.. యాంటీ బయోటిక్ మందులను మితిమీరి తీసుకోవడం వల్ల కలిగే దుష్ఫ్రభావాలపై నిమ్స్‌తో కలిసి అధ్యయనం చేయనున్నది. ఇండియాలో యాంటీ బయోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. డాక్టర్లు తమ ప్రిస్కిప్షన్స్‌లో రాయకపోయినా చాలా మెడికల్ షాపులు రోగులకు నేరుగా అమ్మేస్తున్నాయి. వీటిని ఓవర్ ద కౌంటర్ సేల్స్(ఓటీసీ) అని అంటుంటారు. ఈ సేల్స్ ఇండియాలో పెరిగిపోవడంతో దాన్ని ఎలా నిరోధించాలనే విషయంపై నిమ్స్‌తో కలిసి నెదర్లాండ్స్ గవర్నమెంట్ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు.

నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందం నిరుడు నవంబర్‌లో ఒక సారి నిమ్స్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో యాంటీ బయోటిక్స్ వాడకం.. యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్‌పై అధ్యయనం చేశారు. తాజాగా నెదర్లాండ్స్ ఆరోగ్య మంత్రి జోహాన్ కూపర్స్ నిమ్స్‌కు వచ్చారు. ఈ అధ్యయనంలో భాగంగా యాంటీ బయోటిక్స్ వాడకం, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

మానవ శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర ప్రక్రియలు ఎంత వరకు ఈ మందులను ప్రతిఘటిస్తున్నాయో అధ్యయనం చేస్తున్నారు. అలా వచ్చిన డేటాను ఇండియా, నెదర్లాండ్స్‌లో ఉన్న డేటాతో కంపేర్ చేస్తారు. ఈ అధ్యయనం వల్ల యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ సమస్యను ఎంత మేరకు తగ్గించవచ్చనే విషయంపై పరిష్కారాలు కనుగొంటామని మంత్రి జోహన్ కూపర్స్ చెప్పారు. పూర్తి అధ్యయనం తర్వాత యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్) సమస్యకు సంబంధించిన ఫార్ములాను రూపొందిస్తారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలియజేశారు.

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏఎంఆర్ కేసులు తరచుగా కనిపిస్తున్నాయి. అయితే, మన దేశంలో లభించే యాంటీ బయోటిక్స్ చాలా పరిమితంగానే ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న యాంటీ బయోటిక్స్‌ వల్ల కలుగుతున్న రెసిస్టెన్స్ సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. నిమ్స్‌లో జరుగుతున్న అధ్యయనం పూర్తయితే ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  21 Aug 2023 4:22 AM GMT
Next Story