Telugu Global
Telangana

సానియా-షోయబ్ ల విడాకులపై మరోసారి వైరల్ అవుతున్న వార్తలు

ఒకవేళ షోయబ్ రావడానికి కుదరకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా సానియాకు వీడ్కోలు సందేశం పంపవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే షోయబ్ దీని గురించి పట్టించుకోలేదు.

సానియా-షోయబ్ ల విడాకులపై మరోసారి వైరల్ అవుతున్న వార్తలు
X

భారత స్టార్ టెన్నిస్ ప్లేయ‌ర్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు విడిపోనున్నారనే వార్తలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. సానియా-షోయబ్‌లది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. 2010లో హైదరాబాద్ లో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కాగా, ఏడాది నుంచి సానియా దంపతులు విడిపోతున్నారని, త్వరలో విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి ప్రచారం పదేపదే చెలరేగుతున్నప్పటికీ అటు సానియా కానీ, ఇటు షోయబ్ కానీ ఖండించడం లేదు.

షోయబ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంటుండగా, సానియా హైదరాబాద్ లో ఉంటోంది. ఇటీవలే సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికింది. నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఫేర్వెల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో సానియా తన ఆఖరి ఆట ఆడింది. అనంతరం సానియా గౌరవార్థం ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన ఈవెంట్లో సినీ, క్రీడా, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరై సానియాకు ఘనంగా వీడ్కోలు పలికారు.

తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు మహ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, హీరోలు మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులు సానియాకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో సానియా భర్త షోయబ్ మాలిక్ ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం షోయబ్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (పీఎస్‌ఎల్)లో మ్యాచ్ లు ఆడుతున్నాడు. అవేమీ అంతర్జాతీయ మ్యాచులు కాదు కాబట్టి షోయబ్ ఇండియాకు రావడానికి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చు.

ఒకవేళ షోయబ్ రావడానికి కుదరకపోయినా సోషల్ మీడియా ద్వారా అయినా సానియాకు వీడ్కోలు సందేశం పంపవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే షోయబ్ దీని గురించి పట్టించుకోలేదు. దీంతో మరోసారి సానియా - షోయబ్ విడాకుల వ్యవహారం తెర మీదకు వచ్చింది. వారిద్దరి మధ్య దూరం పెరిగింది కాబట్టే షోయబ్ సానియాకు ఫేర్వెల్ పలకడానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడైనా సానియా మీర్జా దంపతులు విడాకులపై వస్తున్న ప్రచారంపై స్పందిస్తారేమో చూడాలి.

First Published:  6 March 2023 8:48 AM GMT
Next Story