Telugu Global
Telangana

వీఆర్ఏల సర్దుబాటుకోసం పోస్ట్ లు మంజూరు

వీఆర్‌ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆయా శాఖల్లో 14,954 పోస్ట్ లను సృష్టిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వీఆర్ఏల సర్దుబాటుకోసం పోస్ట్ లు మంజూరు
X

తెలంగాణలో వీఆర్ఏ ల సర్దుబాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పోస్ట్ లు మంజూరు చేసింది. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్‌, 2,113 రికార్డ్‌ అసిస్టెంట్‌, 679 సబార్డినేట్‌ పోస్టులు మంజూరు చేసింది. మిషన్‌ భగీరథ శాఖలో 3,3,72 హెల్పర్‌ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్‌, హెల్పర్‌ పోస్టులు, పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్‌ పోస్టులు కేటాయించింది. మొత్తం 14,954 పోస్ట్ లను కొత్తగా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీఆర్‌ఏల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆయా శాఖల్లో పోస్ట్ లను సృష్టిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వీఆర్ఏ ల అర్హతలు, వారి అనుభవాన్ని బట్టి వారిని ఆయా పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. దీంతో తెలంగాణలో ఇక వీఆర్ఏ అనే పోస్ట్ లు ఉండవు.

నెలరోజుల్లోపే ప్రక్రియ..

వీఆర్ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేయాలంటూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నెలరోజుల్లోపే అన్ని ప్రక్రియలు పూర్తవుతున్నాయి. మంత్రి వర్గ ఉపసంఘం నియమించడం, ఉపసంఘంతో వీఆర్ఏల చర్చలు, అనంతరం సీఎం కేసీఆర్ కి నివేదిక సమర్పించడం.. ఇలా అన్ని పరిణామాలు చకచకా జరిగాయి. తాజాగా పోస్ట్ లు మంజూరు చేయడంతో వీఆర్ఏ ల కథ సుఖాంతం అవుతోంది.

First Published:  4 Aug 2023 12:43 PM GMT
Next Story