Telugu Global
Telangana

43శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణకే..

ఈ విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 2118 సీట్లను కేంద్రం మంజూరు చేసింది అందులో 900 సీట్లు తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు లభించాయి.

43శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణకే..
X

43శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణకే..

దేశంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ఆ కొత్త కాలేజీల కోసం ఎంబీబీఎస్ సీట్లను కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించింది. అలా కొత్తగా కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణకు దక్కడం విశేషం. దేశవ్యాప్తంగా కొత్త కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లలో ఒక్క తెలంగాణకే దాదాపు సగభాగం రావడం గర్వకారణం అని అన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ విజన్ కి ఇదో ఓ మచ్చు తునక అంటూ ట్వీట్ వేశారు.

ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, వాటిలో సీట్లకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఈ విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 2118 సీట్లను కేంద్రం మంజూరు చేసింది అందులో 900 సీట్లు తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు లభించాయి.


జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అనే ఆలోచనతో సీఎం కేసీఆర్ తెలంగాణలో వైద్య విద్యకు ఎనలేని ప్రోత్సాహమిచ్చారు. ఆరోగ్య తెలంగాణ అనే లక్ష్యంలో ఇదొక భాగం. ఈ ఏడాది తెలంగాణలో మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనుమతి సాధించాయి. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ కాలేజీలు ఒకే ఏడాదిలో అనుమతులు సాధించాయి. ఈ 9 కాలేజీల పరిధిలో 900 MBBS సీట్లు అదనంగా తెలంగాణకు లభించాయి. మిగతా కాలేజీలకు కూడా అనుమతి లభిస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు మంత్రి హరీష్ రావు.

First Published:  4 July 2023 10:44 AM GMT
Next Story