Telugu Global
Telangana

నవశకం మొదలు... బీఆరెస్ జెండా ఆవిష్కరించిన కేసీఆర్

బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ భవన్ ఆవరణలో భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా బీఆరెస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. జై బీఆరెస్, జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది.

నవశకం మొదలు... బీఆరెస్ జెండా ఆవిష్కరించిన కేసీఆర్
X

తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు ఈ రోజు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ముందుగా పూజా కార్యక్రమాల తర్వాత స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ భార‌త రాష్ట్ర స‌మితి ప‌త్రాల‌పై సంత‌కం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమార‌స్వామి, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు నాయకులు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధ‌రించారు.

అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్ ఆవరణలో భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా బీఆరెస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. జై బీఆరెస్, జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తో సహా తెలంగాణ మంత్రులు, బీఆరెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Next Story