Telugu Global
Telangana

కొత్తగా 10 లక్షల పించన్లు - తెలంగాణ మంత్రి వర్గం నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఇవ్వాళ్ళ ప్రగతి భవన్ లో 5 గంటల‌పాటు సాగింది. ఈ నెల 15 నుంచి కొత్తగా 10 లక్షల మ‍ందికి పించన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

కొత్తగా 10 లక్షల పించన్లు - తెలంగాణ మంత్రి వర్గం నిర్ణయం
X

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పింఛ‌న్లు అందజేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఈ నెల 15 న రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 10 ల‌క్ష‌ల మందికి కొత్త‌గా పింఛ‌న్లు అంద‌నున్నాయి. కొత్తవి,. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ రోజు ప్రగతి భవన్ లో దాదాపు 5 గంటల‌ పాటు మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 58 ఏళ్ళు నిండి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛ‌న్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆగ‌స్టు 15 సందర్భంగా స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన ఖైదీలను విడుదల చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని జైళ్ల‌లో ఉన్న ఖైదీల్లో 75 మంది ఖైదీల‌ను విడుదల చేయనున్నారు. అంతేకాక హైదరాబాద్, కోఠిలోని ఇఎన్‌టీ ఆసుప‌త్రిని, మాసబ్ టాంక్,మెహదీపట్నం రోడ్ లో ఉన్న‌ స‌రోజినిదేవీ కంటి ఆసుప‌త్రిని అధునాత‌న సౌక‌ర్యాల‌తో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కోఠిలో ఇఎన్‌టీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాలని, స‌రోజినిదేవీ కంటి ఆసుప‌త్రి ప్రాంగణంలో కొత్త భ‌వ‌న స‌ముదాయాన్ని నిర్మించేందుకు కేబినెట్ తీర్మానించింది.

First Published:  11 Aug 2022 3:32 PM GMT
Next Story