Telugu Global
Telangana

'సీఎస్ శాంతికుమారి నన్ను కలవలేదన్నారుగా.. మరి ఈ ఫొటోలో ఉన్నదెవరో చెప్పండి గవర్నర్ గారూ!'

గవర్నర్ చేసిన ట్వీట్‌పై టీఎస్‌ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ కూడా మండి పడ్డారు. రాజ్‌‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలు, ఎట్‌హోంలో గవర్నర్ పక్కనే సీఎం శాంతికుమారి ఉన్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు.

సీఎస్ శాంతికుమారి నన్ను కలవలేదన్నారుగా.. మరి ఈ ఫొటోలో ఉన్నదెవరో చెప్పండి గవర్నర్ గారూ!
X

'ఢిల్లీ కన్నా రాజ్‌భవన్ చాలా దగ్గర. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా వచ్చి కలిసేందుకు మీకు సమయం దొరకలేదా? ప్రోటోకాల్ తెలియదా?...' అటూ తెలంగాణ సీఎస్ శాంతికుమారిని ఉద్దేశించిన గవర్నర్ తమిళిసై ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో పాసైన పలు బిల్లులు కొన్ని నెలలుగా గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో సీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై గవర్నర్ తమిళిసై.. సీఎం శాంతి కుమారి టార్గెట్‌గా ట్వీట్లు చేశారు.

ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతి కుమారి తనను వచ్చి కలవలేదని ఆరోపించారు. శాంతి కుమారి జనవరి 11న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టగా.. జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకలను పూర్తిగా ఆమే పర్యవేక్షించారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోంలో కూడా సీఎం పాల్గొన్నారు. ఆ రోజంతా గవర్నర్ తమిళిసై, సీఎం శాంతికుమారి పక్కపక్కనే ఉన్నారు. అయినా సరే ఇంత వరకు సీఎస్ తనను వచ్చి కలవలేదంటూ బహిరంగంగానే గవర్నర్ అబద్దం చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.

10 నెలలుగా 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నా.. రెండు నెలల క్రితం వచ్చిన సీఎస్‌ను టార్గెట్‌గా చేసుకోవడంపై నెటిజన్లు మండిపోతున్నారు. ఇన్ని ట్వీట్లు చేసే బదులు బిల్లులపై సంతకం పెడితే సరిపోతుందిగా అని సూచిస్తున్నారు. మొదట్లో సీఎం కేసీఆర్ నన్ను కలవడం లేదని పత్రికలకు ఎక్కారు.. ఇప్పుడు సీఎస్ నా దగ్గరకు రావడం లేదని చెబుతున్నారు. మీ సమస్య ఏంటి మేడమ్? అంతలా రాజకీయాలు చేయాలనుకుంటే బీజేపీ తరపున పోటీ చేయండి అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

గవర్నర్ చేసిన ట్వీట్‌పై టీఎస్‌ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ కూడా మండి పడ్డారు. రాజ్‌‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలు, ఎట్‌హోంలో గవర్నర్ పక్కనే సీఎం శాంతికుమారి ఉన్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. అక్కడ ఉన్నది సీఎస్ కాకపోతే ఆమె కవలి సోదరి పాల్గొన్నారా? అంటూ గవర్నర్‌పై సెటైర్లు వేశారు. మొత్తానికి సీఎస్‌పై విమర్శలు చేద్దామిన అనుకున్న గవర్నర్‌ తమిళిసైకి నెటిజన్లు వేసే కౌంటర్లకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు.


First Published:  4 March 2023 3:58 AM GMT
Next Story