Telugu Global
Telangana

కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని..? రేవంత్ రెడ్డితో భేటీ

సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ ఆమె ఆ పార్టీలో యాక్టివ్ గా లేరు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తిలో సుహాసిని ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి నందమూరి సుహాసిని..? రేవంత్ రెడ్డితో భేటీ
X

తెలంగాణ టీడీపీ నాయకురాలు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నందమూరి సుహాసిని కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె పరాజయం చెందారు.

సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ ఆమె ఆ పార్టీలో యాక్టివ్ గా లేరు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తిలో సుహాసిని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నందమూరి సుహాసిని ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షీతో భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె ముఖ్యమంత్రిని కలిశారు. లోక్ సభ ఎన్నికల ముంగిట్లో రేవంత్ రెడ్డిని సుహాసిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో నందమూరి సుహాసిని కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ లో చేరిన హైదరాబాద్ మేయర్

కాగా, ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి కూడా బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

First Published:  30 March 2024 11:45 AM GMT
Next Story