Telugu Global
Telangana

నాగబాబు బూతు పంచాంగం.. తమ్మారెడ్డికి కౌంటర్

“నీ -- -- ఖర్చు పెట్టాడారా 80కోట్లు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం” అని ట్వీట్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగబాబు బూతు పంచాంగం.. తమ్మారెడ్డికి కౌంటర్
X

టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అంటూ నాగబాబు బూతులు మాట్లాడేశారు. నీ -- -- అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే ఈ బూతు పంచాంగం వైసీపీ వారి పరిభాషలో అంటూ అటు రాజకీయాలను కూడా కలిపేశారు. మొత్తమ్మీద తమ్మారెడ్డి భరద్వాజపై ఇన్ డైరెక్ట్ గా నాగబాబు వేసిన కౌంటర్, వాడిన భాష ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు రేస్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా అసలు ఆస్కార్ దాకా వెళ్లేందుకు, హాలీవుడ్ మీడియా కూడా ఆ సినిమా గురించి చర్చిందేందుకు, హడావిడి నడిచేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డ భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ టీమ్ 80కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. ఆ డబ్బుతో తాము 8 సినిమాలు తీసి మొహాన కొడతామంటూ మరింత మంట రాజేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తోపాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు కూడ తమ్మారెడ్డిపై మండిపడుతున్నారు. ఇప్పుడు నాగబాబు కౌంటర్ మాత్రం పీక్స్ కి వెళ్లిపోయింది.


ఇటీవల నాగబాబు ట్వీట్లు బాగా ఘాటుగానే ఉంటున్నాయి. ఆమధ్య మంత్రి రోజాకి కూడా ఆయన కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు. ఇప్పుడు మరింత ఘాటుగా తమ్మారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన ఎక్కడా తమ్మారెడ్డి పేరు ప్రస్తావించలేదు. “నీ -- -- ఖర్చు పెట్టాడారా 80కోట్లు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం” అని ట్వీట్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం మొత్తం తమ్మారెడ్డి వ్యాఖ్యలు హీట్ పుట్టించగా, ఈరోజు నాగబాబు రియాక్షన్ హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలపై ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చ నడుస్తోంది.

First Published:  9 March 2023 3:42 PM GMT
Next Story