Telugu Global
Telangana

గరికపాటిపై నాగబాబు ఫైర్

బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో తన సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

గరికపాటిపై నాగబాబు ఫైర్
X

చిరంజీవి తమ్ముడు నాగబాబు మరో వివాదానికి తెరలేపారు. బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో తన సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలపై నాగబాబు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

అలయ్ బలయ్‌కి వచ్చిన చిరంజీవి అక్కడే ఉన్న మహిళల విజ్ఞప్తి మేరకు ఫొటోలు దిగారు. వేదిక మీద పక్కనే చిరంజీవి మహిళలతో కలిసి ఫొటోలు దిగుతుండడంతో అక్కడంతా గందరగోళంగా కనిపించింది. దాంతో గరికపాటి చాలా సీరియస్ అయ్యారు. తక్షణం ఆ ఫొటో సెషన్ అపేయాలన్నారు. అప్పుడే తాను మాట్లాడుతానని తేల్చేశారు. ఒకవేళ ఆపకపోతే తాను వెళ్లిపోతానని కూడా హెచ్చరించారు. అలా రెండు మూడు సార్లు హెచ్చరించడంతో చిరంజీవి అక్కడి నుంచి వచ్చి సీట్లో కూర్చుకున్నారు.

ఆ తర్వాత గరికపాటి, చిరంజీవి ఇద్దరూ బాగానే పలకరించుకున్నారు. నాగబాబు మాత్రం గరికపాటిపై ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. ఏ పాటి వాడికైనా చిరంజీవిగారి ఇమేజ్‌చూస్తే ఆ పాటి అసూయ పడడం పరిపాటే అంటూ..ట్వీట్ చేశారు. దాంతో నాగబాబు ట్వీట్ గరికపాటి మీదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే నాగబాబు దృష్టిలో గరికపాటి ఒక అసూయపరుడా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Next Story