Telugu Global
Telangana

మైనంపల్లి కొడుకు గెలుస్తాడా..?

ఎలాంటి రాజకీయ అనుభవం లేని మైనంపల్లి కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడా అని..?. వృత్తి పరంగా డాక్టర్ అయిన రోహిత్.. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో మైనంపల్లి సోషల్ సర్వీసెస్ పేరిట మూడేళ్లుగా జనాల్లో తిరుగుతున్నారు.

మైనంపల్లి కొడుకు గెలుస్తాడా..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. జనం దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మెదక్ ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్‌ రావు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పంజా విజయ్‌ కుమార్ పోటీలో ఉన్నారు. ఈయనకు గతంలో ZPTCగా చేసిన అనుభవం ఉంది.

మెదక్‌లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉండబోతోంది. ఇప్పుడు అందరి ప్రశ్నల్లా.. ఎలాంటి రాజకీయ అనుభవం లేని మైనంపల్లి కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడా అని..?. వృత్తి పరంగా డాక్టర్ అయిన రోహిత్.. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో మైనంపల్లి సోషల్ సర్వీసెస్ పేరిట మూడేళ్లుగా జనాల్లో తిరుగుతున్నారు. కానీ ప్రత్యర్థిగా ఉన్న పద్మా దేవేందర్‌ రెడ్డికి ౩సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. పార్టీ అధికారంలో ఉండటం, సీఎం కేసీఆర్ చరిష్మా ఆమెకు అదనపు బలం.

మైనంపల్లి రోహిత్‌రావుకు ఉన్న ఏకైక బలం తండ్రి హన్మంతరావే. హన్మంతరావుకు మెదక్‌ జిల్లాపై కొంత పట్టుంది. తెలుగుదేశం హయంలో ఆయన మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మెదక్ జిల్లా రామయంపేట నుంచి 2సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు. కొడుక్కు టిక్కెట్ ఇవ్వలేదని BRS పార్టీపై కక్ష పెంచుకున్న మైనంపల్లి హన్మంతరావు.. మెదక్‌లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. చూడాలి మరి మెదక్ ప్రజలు ఎవరికి పట్టం కడుతారో.

First Published:  10 Nov 2023 2:01 AM GMT
Next Story