Telugu Global
Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం..!

ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి వద్ద కత్తి, ఒక పిస్టల్ ఉండడం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం..!
X

పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్.12 లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ సంఘటన జరిగింది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద మంగళవారం ఉదయం నుంచి ఆ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతడి పట్ల అనుమానం రావడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి వద్ద కత్తి, ఒక పిస్టల్ ఉండడం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ గా గుర్తించారు. కొంతకాలం కిందట జీవన్ రెడ్డి కిల్లెడ సర్పంచ్ గా ఉన్న లావణ్యను పదవి నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ప్రసాద్ గౌడ్ జీవన్ రెడ్డి పై కక్ష పెంచుకున్నాడు.

ఎమ్మెల్యేను హత్య చేయాలని నిర్ణయించుకున్న ప్రసాద్ గౌడ్ కత్తి, పిస్టల్ తీసుకుని హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే ఇంటి వద్ద అతడు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఎమ్మెల్యే సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో జీవన్ రెడ్డి నివాసం వద్దే ఆయన హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  2 Aug 2022 5:14 AM GMT
Next Story