Telugu Global
Telangana

మునుగోడు ప్రజలు ఓడించింది రాజగోపాల్ ను కాదు మోడీ, షాలను -కేటీఆర్

మునుగోడు ప్రజలు ఓడించింది రాజగోపాల్ ను కాదు మోడీ, షాలను  -కేటీఆర్
X

మునుగోడు ప్రజలు ఓడించింది కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాదు నరేంద్ర మోడీ, అమిత్ షాలను ఓడించారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మనుగోడులో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ లో సంబురాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలోమాట్లాడుతూ... టీఆరెస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, గెలుపుకు కృషి చేసిన టీఆరెస్, వామపక్ష నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

దేశవ్యాప్తం గా బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరత పాలు చేస్తున్న బీజేపీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూలదోయాలని కుట్ర చేశారని అందులోని భాగమే మునుగోడు ఎన్నిక అని కేటీఆర్ ఆరోపించారు.

బీజేపీ నాయకులు మునుగోడు లో వందల కోట్ల రూపాయలు ఖర్ఛు చేశారని, అయినా ప్రజలు, ఆత్మగౌరవాన్ని, అభివృద్దిని కాక్షించి టీఆరెస్ ను గెలిపించారని కేటీఆర్ అన్నారు. మా నాయకులపైనే దాడులు చేసి దొంగే దొంగా దొంగా అన్నట్టు తమపై దాడులు చేసినట్టు ప్రచారం చేసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

బీజేపీ ఫేకు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి కేసీఆర్ తో కలిశారని అబద్దపు ప్రచారం, మునుగోడులో కోమటి రెడ్డి ఓటు వేశారనే అబద్దపు ప్రచారం చేశారని, మంత్రి జగదీష్ రెడ్డి పీఏ దగ్గర ఐటీకి డబ్బులు దొరికాయన్న అబద్దాలు ప్రచారం చేశారని కేటీఆర్ అన్నారు

మునుగోడు ఎన్నికల్లో టీఆరెస్ ఎమ్మెల్యేలు మంత్రులందరూ అక్కడ మోహరించారన్న బీజేపీ వాదనలపై కేటీర్ స్పందిస్తూ బీజేపీ చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా ? అనిప్రశ్నించారు హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేయొచ్చు, కేంద్ర మంత్రులందరూ వచ్చి ప్రచారం చేయొచ్చు...కానీ మేము మునుగోడులో ప్రచారం చేస్తే తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు.

First Published:  6 Nov 2022 12:54 PM GMT
Next Story