Telugu Global
Telangana

మునుగోడు ఎన్నికలు: నా కుమారుడు డబ్బులు ఇస్తే నాకేం సంబంధం ? -రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు వాదన‌

మునుగోడు లోని 22 మంది వ్యక్తుల ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసింది తన కుమారుడి కంపెనీ అని, దానితో తనకేమీ సంబంధంలేదని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు జవాబిచ్చారు.

మునుగోడు ఎన్నికలు: నా కుమారుడు డబ్బులు ఇస్తే నాకేం సంబంధం ? -రాజగోపాల్ రెడ్డి అడ్డగోలు వాదన‌
X

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న 22 వ్యక్తిగత అకౌంట్లకు 5.22 కోట్ల రూపాయలు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ అకౌంట్ నుంచి బదిలీ అయింది. దీనికి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ సేకరించి ఈసీకి పిర్యాదు చేసింది. దీనిపై ఎన్నికల సంఘం రాజగోపాల్ రెడ్డికి నోటీసులిచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వలేకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది.

ఈసీ నోటీసులకు జవాబిచ్చిన రాజగోపాల్ రెడ్డి ఆ డబ్బుతో, అసలు సుశీ ఇన్ ఫ్రా కంపెనీతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఆ కంపెనీ తన కుమారుడికి చెందినదని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసినట్టు రాజగోపాల్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఇదంతా తనపై ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారం అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో అన్నారు.

కాగా సుశీ ఇన్ ఫ్రా కంపెనీకి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. ఇదే కంపెనీకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం జార్ఖండ్ లో 18 వేల కోట్ల విలువచేసే ఓ బొగ్గు మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ విషయం స్వయంగా రాజగోపాల్ రెడ్డే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. అది తన కంపెనీ అని కూడా ఆ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి చెప్పారు. టెక్నికల్ గా ఆ కంపెనీలో రాజగోపాల్ రెడ్డి లేకపోయినప్పటికీ అది ఆయన కుమారుడి అద్వర్యంలో నడుస్తోంది.

అయితే ఈ కంపెనీని ప్రారంభించింది కోమటి రెడ్డి వెంకట రెడ్డి కాగా తర్వాత దానికి రాజగోపాల్ రెడ్డి యజమాని అయ్యారు. ఆ తర్వాత ఆయన తప్పుకొని తన కుమారుడినిని ఆ క‍ంపెనీకి ఎండీ చేశారు.

ఇప్పుడు అదే కంపెనీ నుంచి మునుగోడు లోని 22 అకౌంట్లకు 5.22 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. ఈ డబ్బులు మునుగోడు ఎన్నికల్లో ప్రజలకు పంచడం కోసమేనని టీఆరెస్ ఆరోపిస్తోంది.

First Published:  31 Oct 2022 10:06 AM GMT
Next Story