Telugu Global
Telangana

రేపే మునుగోడు రిజల్ట్.. మధ్యాహ్నం 1గంటకు లెక్కింపు పూర్తి

Munugode Bypoll Results: ఇప్పటికే కాంగ్రెస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. బీజేపీ కూడా చప్పుడు లేకుండా ఉంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఫలితాల మరుసటి రోజు ఆస్ట్రేలియాకు టికెట్ బుక్ చేసుకోవడంతో ఆయనకు గెలుపుపై ఏమాత్రం నమ్మకం ఉందో తేలిపోయింది.

Munugode Bypoll Results: రేపే మునుగోడు రిజల్ట్.. మధ్యాహ్నం 1గంటకు లెక్కింపు పూర్తి
X

Munugode Bypoll Results: రేపే మునుగోడు రిజల్ట్.. మధ్యాహ్నం 1గంటకు లెక్కింపు పూర్తి

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు మొదలయ్యే లెక్కింపు మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తవుతుంది. ఒంటిగంట తర్వాత అధికారికంగా ఫలితాన్ని ప్రకటిస్తారు. గంటలోపే తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. గంటకు 3 నుంచి 4 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

నల్గొండలోని ఆర్జాలబావి గోడౌన్ల వద్ద స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అక్కడే కౌంటింగ్ కి అన్నీ సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. తొలుత ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. ఏడు మండలాల్లో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాల్లో 298 ఈవీఎంలను వినియోగించారు. మొదట చౌటుప్పల్‌ మండలంలోని ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఈవీఎంలను వరుసగా లెక్కిస్తారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, రిటర్నింగ్‌ ఆఫీసర్ రోహిత్‌ సింగ్‌ తో పాటు కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్‌ జరుగుతుంది.

చప్పుడులేని బీజేపీ..

ఫలితాలు వస్తున్నాయంటే రాజకీయ పార్టీల్లో హడావిడి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. బీజేపీ కూడా చప్పుడు లేకుండా ఉంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఫలితాల మరుసటి రోజు ఆస్ట్రేలియాకు టికెట్ బుక్ చేసుకోవడంతో ఆయనకు గెలుపుపై ఏమాత్రం నమ్మకం ఉందో తేలిపోయింది. ఇక టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలకు రెడీ అవుతున్నాయి. పోలింగ్ కేంద్రం వద్ద హడావిడి చేసేందుకు టీఆర్ఎస్ ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్ ఫలితం రాగానే కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి మొదలవుతుంది.

First Published:  5 Nov 2022 9:30 AM GMT
Next Story