Telugu Global
Telangana

డాట్ బాల్ ట్రీస్.. బీసీసీఐకి ఎంపీ సంతోష్ థ్యాంక్స్..

డాట్‌ బాల్స్ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 మొక్కలను నాటుతోంది. ఇటీవలే ఐపీఎల్ పూర్తి కాగా కొన్ని టీమ్ లకు మొక్కలు అందించింది. బీసీసీఐ వినూత్న కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అభినందించారు.

డాట్ బాల్ ట్రీస్.. బీసీసీఐకి ఎంపీ సంతోష్ థ్యాంక్స్..
X

క్రికెట్ ఇప్పుడు పూర్తిగా బ్యాట్స్ మెన్ గేమ్ గా మారిపోయింది. అందులోనూ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత మ్యాచ్ లో సిక్స్ లు ఎన్ని, ఫోర్లు ఎన్ని, సెంచరీలెన్ని.. ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. బౌలర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఇటీవలి ఐపీఎల్ సిరీస్ లో డాట్ బాల్ ట్రీస్ అనే కార్యక్రమం చేపట్టింది బీసీసీఐ. పరుగులేవీ రాని బంతిని డాట్ బాల్ అంటారు. అలా ఐపీఎల్ లో ఎన్ని డాట్ బాల్స్ పడతాయో అన్ని మొక్కల్ని నాటే కార్యక్రమమే డాట్ బాల్ ట్రీస్. తాజా టాటా ఐపీఎల్ లో దీన్ని అమలు చేశారు. ప్లే ఆఫ్ మ్యాచ్ లలో నమోదయ్యే ఒక్కో డాట్ బాల్ కి 500 మొక్కల చొప్పున నాటేలా దీన్ని డిజైన్ చేశారు. బీసీసీఐ నిర్ణయాన్ని అన్ని టీమ్ లు అమలులో పెట్టాయి. డాట్ బాల్ కి 500 మొక్కల చొప్పున నాటాయి.


ఈ కార్యక్రమంలో భాగంగా డాట్‌ బాల్స్ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 మొక్కలను నాటుతోంది. ఇటీవలే ఐపీఎల్ పూర్తి కాగా కొన్ని టీమ్ లకు మొక్కలు అందించింది. వాటిని నాటిన తర్వాత బీసీసీఐ ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపింది. బీసీసీఐ వినూత్న కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అభినందించారు.


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సంతోష్ కుమార్ సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తున్నారు. వారు విసిరిన ఛాలెంజ్ ల ద్వారా ప్రేరణ పొందిన అభిమానులు కూడా మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు పచ్చదనం పెంచడం కోసం కొత్త ఆలోచనలతో వచ్చిన బీసీసీఐకి, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ టీమ్‌ తరపున ఎంపీ సంతోష్ కుమార్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీకి ఓ లేఖ రాశారు. ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

First Published:  31 May 2023 11:54 AM GMT
Next Story