Telugu Global
Telangana

నోటీసులు అందలేదా? ఇంకోసారి ఇస్తాం స్పందించండి..

వెంకటరెడ్డి వ్యాఖ్యలపై గత నెల 22న కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే నోటీసులను వెంకటరెడ్డి లైట్ తీసుకున్నారు.

నోటీసులు అందలేదా? ఇంకోసారి ఇస్తాం స్పందించండి..
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ అభ్యర్థికి ఓటేయాలని ఆడియో టేపు విడుదల చేసినప్పటికీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు విషయంలో కాంగ్రెస్ జంకుతోంది. ఏదో విధంగా కోమటిరెడ్డి సంజాయిషీ ఇస్తే సర్దుకుపోయేలా ఉంది. కానీ, వెంకటరెడ్డి నుంచి కనీస స్పందన కూడా లేదు.

వెంకటరెడ్డి వ్యాఖ్యలపై గత నెల 22న కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే నోటీసులను వెంకటరెడ్డి లైట్ తీసుకున్నారు. వివరణ సంగతి తర్వాత కనీసం స్పందించలేదు. ఇచ్చిన పదిరోజుల గడువు ముగియడంతో చర్యలు తీసుకుంటారని భావించారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ వెంకటరెడ్డి కార్యాలయానికి ఫోన్ చేసి నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంపై ఆరా తీసింది. దాంతో అసలు తమకు నోటీసులే అందలేదని వెంకటరెడ్డి కార్యాలయం తేల్చేసింది.

దాంతో సరే మరోసారి నోటీసులు ఇస్తున్నట్టు చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. మరో పది రోజుల గడువుతో నోటీసులు ఇచ్చింది. నిజానికి తొలిసారి పంపిన నోటీసులు అందినా కావాలనే వెంకటరెడ్డి అవి అందలేదని చెప్పి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు రెండోసారైనా సమాధానం ఇస్తారా లేదా అన్నది చూడాలి. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఉన్న ఎంపీని పోగొట్టుకోవడం కంటే.. పార్టీకి కాస్త విధేయతగా వెంకటరెడ్డి సమాధాం ఇస్తే సంతోషించి సర్దుకుపోవాలన్నట్టుగా ఉంది.

First Published:  4 Nov 2022 8:05 AM GMT
Next Story