Telugu Global
Telangana

నార్సింగి చైతన్య కళాశాల లోపల నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి

ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి నార్సింగిలోని చైతన్య కాలేజ్ కు వచ్చారు. కాలేజీ లోపలికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటి రెడ్డి, మరణించిన సాత్విక్ తన లేఖలో ప్రస్తావించిన నలుగురిని తక్షణం అరెస్టు చేసే వరకు అక్కడి నుంచి కదలనని స్పష్టం చేశారు.

నార్సింగి చైతన్య కళాశాల లోపల నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన ఎంపీ కోమటిరెడ్డి
X

నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో యాజమాన్యం ఒత్తిడులు తట్టుకోలేక‌ ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి సాత్విక్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ రోజు ఆయన నార్సింగిలోని చైతన్య కాలేజ్ కు వచ్చారు. కాలేజీ లోపలికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నించడంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటి రెడ్డి సాత్విక్ తన లేఖలో ప్రస్తావించిన నలుగురిని తక్షణం అరెస్టు చేసే వరకు అక్కడి నుంచి కదలనని స్పష్టం చేశారు. కాలేజీ ఆవరణలోనే నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.చైతన్య కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక డీసీపీకి ఫోన్ చేసిన కోమటి రెడ్డి తక్షణం కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య , వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్, నరేష్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నార్సింగి సీఐ చైతన్య కాలేజ్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిందితులను అదుపులోకి తీసుకొని రాత్రికి రాత్రి ఎందుకు వదిలేశారని డీసీపీని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

First Published:  2 March 2023 9:18 AM GMT
Next Story