Telugu Global
Telangana

బాలయ్యను మోక్షజ్ఞ అంత మాట అన్నాడా..?

నిజ జీవితంలో బాలయ్యకే ఈ డైలాగు ఎదురైందంట. అదీ ఆయన కుమారుడు మోక్షజ్ఞ నుంచి అంట. స్వయంగా కన్న కొడుకు నుంచే అంతటి మాస్‌ డైలాగ్‌ ఎదురైతే బాలయ్య పరిస్థితి ఎలా ఉంటుంది..? అదే విషయాన్ని స్వయంగా బాలయ్యే వెల్లడించడం గమనార్హం.

బాలయ్యను మోక్షజ్ఞ అంత మాట అన్నాడా..?
X

సినిమాల్లో మాస్‌ డైలాగులతో మెప్పించడంలో బాలయ్య రూటే సెపరేటు అనడంలో అతిశయోక్తి లేదు. విలన్లకు ఆయన ఇచ్చే వార్నింగులు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆయన చెప్పే మాస్‌ డైలాగులకు అభిమానుల విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’లోనూ ఓ మాస్‌ డైలాగ్‌ ఇటీవల చిత్ర బృందం గ్లింప్స్‌ ద్వారా వెల్లడించింది. ‘గ్రౌండ్‌ ఫ్లోర్‌ బలిసిందా బే’.. అంటూ సినిమాలో విలన్‌కు బాలయ్య వార్నింగ్‌ ఇచ్చే ఈ డైలాగ్‌కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది.

అయితే.. నిజ జీవితంలో బాలయ్యకే ఈ డైలాగు ఎదురైందంట. అదీ ఆయన కుమారుడు మోక్షజ్ఞ నుంచి అంట. స్వయంగా కన్న కొడుకు నుంచే అంతటి మాస్‌ డైలాగ్‌ ఎదురైతే బాలయ్య పరిస్థితి ఎలా ఉంటుంది..? అదే విషయాన్ని స్వయంగా బాలయ్యే వెల్లడించడం గమనార్హం. ‘భగవంత్‌ కేసరి’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ను వరంగల్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన బాలకృష్ణ వేదికపై మాట్లాడుతూ.. ``ఈరోజు పొద్దున్నే శ్రీలీలతో ఓ మాట అన్నాను. ఇద్దరం కలిసి నటించాం సరే. నువ్వు చిచ్చా.. చిచ్చా అని నన్ను టార్చర్‌ పెట్టావ్‌. నెక్స్ట్‌ సినిమాలో మనం హీరో హీరోయిన్లుగా నటిద్దామని చెప్పాను. ఇదే మాట ఇంటికెళ్లి మా కుటుంబ సభ్యులతో చెప్పాను. నా కొడుకు మోక్షజ్ఞకు కోపమొచ్చింది. ఏం డాడీ, నేను హీరోగా రాబోతున్నాను, నువ్వు ఆవిడకు ఆఫర్‌ ఇస్తానంటావేంటి..? నీకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ బలిసిందా డాడీ అన్నాడు. నాకు కాసేపు అర్థంకాలేదు. నన్ను అంత మాట అన్నాడేంటని అర్థం కాలేదు..`` అంటూ తన కొడుకు తనకు వార్నింగ్‌ ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు బాలయ్య. దీంతో స్టేజ్‌పై అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

తన తాజా చిత్రంలోని మాస్‌ డైలాగ్‌తోనే మోక్షజ్ఞ ఫన్‌ చేసే ప్రయత్నం చేశాడని బాలయ్య చెప్పాలని భావించినట్టున్నారు. అయితే.. ఎంతోమంది వీక్షించే ఈ వేడుకలో వేదికపైనే ఆయన ఫ్లోలో ఈ విషయం చెప్పేయడం ద్వారా ఫన్‌ కంటే.. నవ్వులపాలైన తీరే ఎక్కువగా కనిపించింది. మరి దీనిపై ఇక ట్రోలర్లు ఎలా స్పందిస్తారో మరి.

First Published:  9 Oct 2023 1:34 AM GMT
Next Story