Telugu Global
Telangana

ఈ నెల 19న హైదరాబాద్ కు మోడీ, పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ‌

మోడీ హైదరాబాద్ రాక సందర్భంగా భారతీయ జనతాపార్టీ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. అయితే అంతకు ఒక రోజు ముందే ఖమ్మంలో బీఆరెస్ తొలి బహిరంగ సభ జరగనుంది. అంతే కాక బీఆరెస్ ఏర్పాటు ప్రకటన తర్వాత మోడీ మొదటి సారి హైదరాబాద్ వస్తున్నారు.

ఈ నెల 19న హైదరాబాద్ కు మోడీ, పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ‌
X

ఈ నెల 19వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించనున్నారు. వీటితో పాటు కాజీపేట వర్క్ షాప్, సికింద్రబాద్ స్టేషన్ రీడెవలప్ మెంట్, సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

హై టెక్నాలజీ హంగులతో వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో వెళ్తుంది. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వయా కాజీపేట మీదుగా వెళ్ళనుంది.

కాగా మోడీ హైదరాబాద్ రాక సందర్భంగా భారతీయ జనతాపార్టీ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. అయితే అంతకు ఒక రోజు ముందే ఖమ్మంలో బీఆరెస్ తొలి బహిరంగ సభ జరగనుంది. అంతే కాక బీఆరెస్ ఏర్పాటు ప్రకటన తర్వాత మోడీ మొదటి సారి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

Next Story