Telugu Global
Telangana

'విశ్వ గురు' ఉచితాలు వద్దంటాడు ఆయన శిష్యుడేమో అన్నీ ఫ్రీ అంటాడు - బీజేపీపై కేటీఆర్ పంచ్

ప్రధాని మోడీ ఒకవైపు ఉచితాల మీద విరుచుకపడుతుండగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్పడం పట్ల కేటీఆర్ వ్యంగ్యంగా స్పంధించారు. దేశం మొత్తానికి ఉచిత గృహాలు, విద్య, ఆరోగ్యంపై పార్లమెంటులో శాసనం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.

విశ్వ గురు ఉచితాలు వద్దంటాడు ఆయన శిష్యుడేమో అన్నీ ఫ్రీ అంటాడు - బీజేపీపై కేటీఆర్ పంచ్
X

దేశ ప్రధాని, బీజేపీ నేత నరేంద్ర మోడీ ప్రజలకు ఉచితాలు ఇవ్వొందంటూ ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే ఆయన శిష్యుడు, ఆ పార్టీ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం తాము అధికారంలోకి రాగానే అన్నీ ఫ్రీ...ఫ్రీ..ఫ్రీ.. అంటు ప్రచారం చేయడం పట్ల మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పంధించారు.

బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిన్న హైదరాబాద్ లోని మూసా పేట లో జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డ అందరికీ ఉచితంగా ఇళ్ళు కట్టిచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ళు, విద్య, వైద్యం...అనీ ఫ్రీ అని ప్రకటించారు.

బండి సంజయ్ మాట్లాడిన ఈ మాటలపై ట్విట్టర్ లో స్పంధించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ సంజయ్ ఉపన్యాసం వార్త పేపర్ కటింగ్ ను షేర్ చేసి వ్యగ్యంగా కామెంట్ చేశారు. ఆయన ట్విట్టర్ లో...

''తెలంగాణా బీజేపీ మూర్ఖత్వం విచిత్రం

విశ్వ గురు ఉచితాలు వద్దు అని చెబుతుండగా, ఈ జోకర్ ఎంపీ ఉచిత విద్య, ఆరోగ్యం, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు!

ఈ దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదా?

దేశం మొత్తానికి ఉచిత గృహాలు, విద్య, ఆరోగ్యంపై పార్లమెంటులో శాసనం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు?'' అని ట్వీట్ చేశారు.

''తెలంగాణ బీజేపీ ఇస్తున్న వాగ్దానాలకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్టాలు తీసుకురావాలని నేను ప్రధానమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వడం కోసం పార్లమెంటులో మీరు బిల్లు పెట్టండి మేము ఓటు వేస్తాము.'' అని కేటీఆర్ తన మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ పై నెటిజనులు పెద్ద ఎత్తున స్పంధించారు. బీజేపీ రెండు నాల్కల ధోరణిపై విరుచుకపడ్డారు. మోడీపై, బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు.

First Published:  15 Sep 2022 3:30 AM GMT
Next Story