Telugu Global
Telangana

బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ.. మనది పేగు బంధం

తెలంగాణ అసాధ్యం అని అందరూ అంటుంటే.. ప్రత్యేక రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కిందని చెప్పారు కవిత. మనం కష్టపడినట్టుగా తెలంగాణ కోసం ఎవరూ కష్టపడలేదన్నారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఆమె సూచించారు.

బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ.. మనది పేగు బంధం
X

బీఆర్‌ఎస్‌ అంటే మన ఇంటిపార్టీ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పిలుపునిచ్చారు. మనది పేగు బంధం, వారిది ఓటు బంధం అని అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడని పేర్కొన్నారు కవిత.

సమావేశానికి ముందు బోధన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్‌ ప్రజలు మరోసారి చూపించారని అన్నారామె. స్థానికంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నిజామాబాద్ కి ఐటీ హబ్ తీసుకొచ్చామని, స్థానిక యువతకు ఉద్యోగాలిప్పిస్తున్నామని చెప్పారు కవిత.


తెలంగాణ అసాధ్యం అని అందరూ అంటుంటే.. ప్రత్యేక రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన ఘనత కేసీఆర్ కి దక్కిందని చెప్పారు కవిత. మనం కష్టపడినట్టుగా తెలంగాణ కోసం ఎవరూ కష్టపడలేదన్నారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఆమె సూచించారు. దేశంలో మతాలు, కులాల వారీగా ప్రజలను రాజకీయ పార్టీలు విభజిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకున్నామని అన్నారు కవిత.

బోధన్‌ లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్‌ అందిస్తున్నామని చెప్పారు కవిత. బోధన్‌ లో 152 చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల సామాజిక పెన్షన్‌ ఇస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేలు పెన్షన్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రజలు ఇంటి పార్టీ బీఆర్ఎస్ కి అండగా నిలబడాలన్నారు కవిత.

First Published:  16 Aug 2023 9:58 AM GMT
Next Story