Telugu Global
Telangana

హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ఎమ్మెల్సీ కవిత

ఆంజ‌నేయుడిని కొలిస్తే ప్రజలంతా సుభిక్షంగా ఉంటార‌ని మనమంతా బ‌లంగా నమ్ముతామని, అందుకే తెలంగాణ‌లోని ప్ర‌తి గ్రామంలో ఆంజ‌నేయ‌స్వామి గుడి ఉంటుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.

హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ఎమ్మెల్సీ కవిత
X

కాలి గాయం కారణంగా దాదాపు నెలరోజులుగా ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత.. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంజన్న అనుగ్ర‌హంతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని ఆమె ఆకాంక్షించారు. కొండ‌గ‌ట్టు ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం, అక్క‌డ నిర్వ‌హించిన హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణంలో పాల్గొన్నారు.

ఆంజనేయ స్వామిని కొలిస్తే మంచి జీవితాన్ని ప్ర‌సాదిస్తారని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, విజయాలను ఇస్తారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఆంజ‌నేయుడిని కొలిస్తే ప్రజలంతా సుభిక్షంగా ఉంటార‌ని మనమంతా బ‌లంగా నమ్ముతామని, అందుకే తెలంగాణ‌లోని ప్ర‌తి గ్రామంలో ఆంజ‌నేయ‌స్వామి గుడి ఉంటుందని చెప్పారు. క‌రోనా క‌ష్ట‌ స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాలంటే హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేయాల‌ని కొండ‌గ‌ట్టు ఆలయ పూజారి జితేంద్ర‌య్య సూచించారని, హనుమాన్ చాలీసా పారాయ‌ణానికి మించిన మందు లేదని ఆయన అన్నారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు కొండ‌గ‌ట్టు అంజ‌న్న సేవా స‌మితి పేరుతో జితేంద్ర‌య్య నేతృత్వంలో అంద‌రం హనుమాన్ చాలీసా పారాయ‌ణం చేస్తున్నామన్నారు.


అనంతరం జగిత్యాల పట్టణంలోని బీరప్ప దేవాలయంలో జరిగిన బీరప్ప కామరతి దేవి కళ్యాణ మహోత్సవంలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్మన్, కురుమ సంఘం నాయకులు హాజరయ్యారు.



First Published:  10 May 2023 11:01 AM GMT
Next Story