Telugu Global
Telangana

అర్వింద్‌ను ఎక్కడైనా ఓడిస్తా..

సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు కవిత. హామీ మేరకు మహిళా కోటాలో సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

అర్వింద్‌ను ఎక్కడైనా ఓడిస్తా..
X

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధమన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడ నిలబడ్డా ఓడిస్తానన్నారు కవిత. మొన్న కోరుట్లలో ఓడించా, ఎంపీ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుద్ది. అర్వింద్ విషయంలో తన అజెండా మారదన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడగొట్టుకుంటే.. తెలంగాణ ప్రజలకే నష్టమన్నారు కవిత. బీఎస్పీతో పొత్తు కేసీఆర్ నిర్ణయమన్న ఆమె.. కేసీఆర్ వ్యూహాలు అంత ఈజీగా అర్థం కావన్నారు.

సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు కవిత. హామీ మేరకు మహిళా కోటాలో సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు కవిత. రేవంత్ సీఎం అవడం మన ఖర్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై రేవంత్ వాడుతున్న భాషను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. లిక్కర్ కేసును టీవీ సీరియల్‌లా లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అందుకే దాని గురించి తాను పట్టించుకోవడం లేదన్నారు. తన టీమ్‌ కేసును ఫాలో అప్ చేస్తోందన్నారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలినన్న కవిత న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు.

First Published:  7 March 2024 10:04 AM GMT
Next Story