ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరినట్లు బీఆర్‌ఎస్ వర్గాల వెల్లడి
BY Raju Asari1 Oct 2024 4:07 AM GMT
X
Raju Asari Updated On: 1 Oct 2024 4:07 AM GMT
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్నప్పుడు ఆమెకు గైనిక్ సమస్యలు వచ్చాయి. తీవ్ర జ్వరంతో పలు సార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గతంలో ఎయిమ్స్‌లో ఆమెకు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో కవిత మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.
Next Story