Telugu Global
Telangana

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రారాజు : ఎమ్మెల్సీ కవిత

శతాబ్ద కాలంగా దేశానికి అవిశ్రాంతంగా వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం, సింగరేణి సంస్థ 103వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు.

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రారాజు : ఎమ్మెల్సీ కవిత
X

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రారాజు : ఎమ్మెల్సీ కవిత

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రారాజని.. దేశంలోనే నెంబర్ వన్ సంస్థ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగరేణి సంస్థ ఆవిర్భవించి 102 ఏళ్లు పూర్తయిన సందర్భాగా ఆమె సంస్థ కార్మికులు, యాజమాన్యానికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్ద కాలంగా దేశానికి అవిశ్రాంతంగా వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం, సింగరేణి సంస్థ 103వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు.

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో, లాభాల్లో, కార్మికుల సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచినట్లు కవిత తెలిపారు. అయితే, బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసి, సంస్థను నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, వాటిని అడ్డుకుంటామని కవిత చెప్పారు. సింగరేణి రక్షణ కోసం కార్మికుల తరపున పోరాడతామని కవిత అన్నారు.

సింగరేణి సంస్థ ఈ ఏడాది ఒక రోజు అత్యధిక ఉత్పత్తి రికార్డును రెండు రోజుల క్రితం సాధించింది. ఒకే రోజు 2.24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా, ఈ నెల 20న 2.35 లక్షల టన్నుల బొగ్గును తరలించినట్లు సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. శ్రీధర్ తెలిపారు. కాగా, ఇటీవల సింగరేణి సంస్థ తమకు బొగ్గు గనులు కేటాయించాలని కోరగా.. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. వేలంలో పాల్గొని బొగ్గు గనులను దక్కించుకోవాలని సూచించింది.

ఇతర రాష్ట్రాలకు గనులను వేలం లేకుండానే కేటాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. సింగరేణికి గనులు కేటాయించకపోవడంపై సీఎం కేసీఆర్ కూడా మండి పడ్డారు. పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టిస్తున్నా.. సింగరేణి సంస్థ మాత్రం కార్మికుల కష్టంతో అత్యధిక ఉత్పత్తిని సాధిస్తోంది.



First Published:  23 Dec 2022 4:49 AM GMT
Next Story