Telugu Global
Telangana

బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించిన హైకోర్టు

బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేసిన కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే విధించిన హైకోర్టు
X

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేసిన కేసులో బీజేపీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేసిన కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ సంతోష్ హాజరుకాకపోవడంతో హైకోర్టు సూచన మేరకు ఆయనను ఈ నెల 26న లేదా 28న తమ ముందు హాజరు కావాలని సిట్ మరో సారి నోటీసులు జారీ చేసింది. అంతే కాక ఎమ్మెల్యేల‌ కొనుగోలు ప్రయత్నంకేసులో ఆయనను ఏ4 నిందితునిగా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్ర‌యించారు. 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద తనకు సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ హైకోర్టును కోరారు.

కోర్టు విచారణలో సంతోష్ తరపు న్యాయవాది వాదిస్తూ, ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి చేసిన పిర్యాదులో సంతోష్ పేరు లేదని, ఎఫ్ ఐ ఆర్ లో కూడా ఆయన పేరు లేదని అలాంటప్పుడు నిందితుల జాబితాలో సంతోష్ పేరును ఎలా చేరుస్తారని ప్రశ్నించారు.

ఇరువైపు వాదనలు విన్న కోర్టు, సిట్ బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై స్టే విధించి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.

First Published:  25 Nov 2022 12:17 PM GMT
Next Story