Telugu Global
Telangana

''చెడుపై యుద్దానికి కాలమెప్పుడూ ఓ వీరుడిని సృష్టిస్తుంది...'' రాహుల్ పై సీతక్క వీడియో

రేపు తెలంగాణలో అడుగుపెట్టబోతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే సీతక్క ఓ వీడియో ద్వారా స్వాగతం తెలిపింది. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

చెడుపై యుద్దానికి కాలమెప్పుడూ ఓ వీరుడిని సృష్టిస్తుంది... రాహుల్ పై సీతక్క వీడియో
X

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యా కుమారి నుండి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలో అడుగుపెట్టనుంది. కర్నాటకలోని రాయచూర్ నుండి రేపు ఉదయం తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా, గూడబెల్లూరులో తెలంగాణలోకి ఎంటర్ కానుంది. కర్నాటక, తెలంగాణా సరిహద్దులోని గూడబెల్లూరులో రాహుల్ భారత్ జోడో యాత్రకు స్వాగతం చెప్పేందుకు టిపిసిసి ఘనంగా ఏర్పాట్లు చేసింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాహుల్ గాంధీకి వెల్కం చెప్తూ కొద్ది సేపటి క్రితం ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ఆ వీడియో ''ఎదిరించే వాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం'' అన్న వాక్యాలతో మొదలవుతుంది. ఆ తర్వాత ''చెడుపై యుద్దానికి కాలమెప్పుడూ ఓ వీరుడిని సృష్టిస్తుంది'' ''అడుగులో అడుగేస్తూ అతడు కడలిలా కదిలొస్తాడు'' అని వ్యాఖ్యాలు ఉన్నాయి. భారత్ జోడో యాత్ర , తెలంగాణ అని చివ‌రకు ఎండ్ అవుతుంది. ఆ వీడియో పోస్ట్ చేసిన సీతక్క 'వెల్కం రాహులన్నా' అని కామెంట్ చేశారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన గంటలోపే 63 రీ ట్వీట్లతో దూసుకపోతోంది.


First Published:  22 Oct 2022 3:12 PM GMT
Next Story